hyderabadupdates.com movies సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డికి ఈరోజు నోటీసులు ఇచ్చింది. ఈనెల 13వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ నిజమని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ బృందం తేల్చింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో లడ్డూ తయారీకి బోలే బాబా డెయిరీ నుంచి సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో తయారు చేసిందని దర్యాప్తు బృందం తేల్చింది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అని 2024 ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వేళ్లు వైసీపీ హయాం నాటి టిటిడి చైర్మన్లు గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైపు చూపించాయి.

ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టీ చంద్రబాబు గారు టీటీడీ ప్రతిష్ట మంట గలుపుతున్నారు అని అటువంటి కల్తీ కి ఆస్కారం లేదు అని ప్రకటించారు. తమ చిన్నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని.. ఆయన ” సూపర్ స్వామి” అని తన చిన్నాన్నను సమర్థించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడం వైసీపీలో కలకలం రేగింది.

Related Post

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు విచారణను 4 వారాల్లో ముగించేయాలని, తీర్పు ఇవ్వాలని

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారేయార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న తీర్చి దిద్దుతున్నారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్ (సీ-డాక్‌) కేంద్రాన్ని

మూడు కాదు.. రెండే.. జిల్లాల విభ‌జ‌న‌ పై బాబు నిర్ణ‌యం!మూడు కాదు.. రెండే.. జిల్లాల విభ‌జ‌న‌ పై బాబు నిర్ణ‌యం!

ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తాజాగా రెండు జిల్లాలకే పరిమితం కావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రజల అభిప్రాయాలు, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని జిల్లాల