hyderabadupdates.com Gallery సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు

సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు

సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్ షో, సినిమా టికెట్ల ధరలను పెంచాలని కోరుతూ తనను సంప్రదించ వద్దని తాను నిర్మాతలకు స్పష్టంగా చెప్పానని అన్నారు. అందుకే ఆ విష‌యం గురించి తన‌ను అడ‌గ వ‌ద్ద‌ని కోరారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ప్ర‌స్తుతానికి సినిమా శాఖ‌ను చూస్తున్న‌ప్ప‌టికీ తాను అంత‌గా వాటి జోలికి వెళ్ల‌డం లేద‌ని చెప్పారు. కొంద‌రు కావాల‌ని ప‌దే ప‌దే త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.
ప‌దే ప‌దే త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం, నిరాధార‌మైన వార్త‌ల‌ను , క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తూ త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్టకు భంగం క‌లిగించేలా చేస్తున్నారంటూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వాపోయారు. మంత్రిగా ఉన్నా సినీ ప‌రిశ్ర‌మ అంటేనే విసుగు వ‌చ్చింద‌న్నారు. అందుకే తాను సినీ పరిశ్రమ గురించి ఆలోచించడం మానేశానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో విడుదలైన రెండు సినిమాలకు, శుక్రవారం విడుదలైన మరో సినిమాకు, సోమవారం విడుదల కాబోయే ఇంకో సినిమాకు టికెట్ల ధరలు పెంచడానికి సంబంధించిన ఏ ఫైల్ కూడా నాకు అందలేదని బాంబు పేల్చారు. ఓ ఐఏఎస్ అధికారిణితో త‌న‌కు లింకు ఉందంటూ ఓ ఛాన‌ల్ ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
The post సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగంపోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం

హైద‌రాబాద్ : లా అండ్ ఆర్డ‌ర్ ను కాపాడ‌డంలో పోలీసులు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ని అన్నారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. ఆయ‌న అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించారు. సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎంరాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం

విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం విజ‌య‌న‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సినేష‌న్ అనేది ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల‌ని

Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌ కు స్ట్రాంగ్ వార్నింగ్Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌ కు స్ట్రాంగ్ వార్నింగ్

Manoj Kumar Katiyar : పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని భారత వెస్ట్రన్ కమాండ్‌ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ (Manoj Kumar Katiyar) హెచ్చరించారు. అయితే ఈ సారి మామూలుగా ఉండదు…