hyderabadupdates.com Gallery సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో త‌న నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ⁠రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం చంద్ర‌బాబుతో.
ఇదిలా ఉండ‌గా నీటి పారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడు కోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా తిరుమ‌ల ల‌డ్డూ వివాదానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్ట‌డంలో మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని ఈ సంద‌ర్భంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది.
The post సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్

అమ‌రావ‌తి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మ‌న్ బిల్ గేట్స్ సోమ‌వారం ఏపీ రాష్ట్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రుల‌తో సంభాషించారు.

Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌ కు స్ట్రాంగ్ వార్నింగ్Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌ కు స్ట్రాంగ్ వార్నింగ్

Manoj Kumar Katiyar : పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని భారత వెస్ట్రన్ కమాండ్‌ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ (Manoj Kumar Katiyar) హెచ్చరించారు. అయితే ఈ సారి మామూలుగా ఉండదు…

కిమ్ వారసురాలిగా కిమ్ కూతురుకిమ్ వారసురాలిగా కిమ్ కూతురు

ఉత్త‌ర కొరియా : ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త‌న త‌దుప‌రి పాల‌కురాలిగా త‌న కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవున‌నే జ‌నం అంటున్నారు. దక్షిణ కొరియా