hyderabadupdates.com movies సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!

సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!

వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ ఎంపీ అన్న కారణంతో గల్లా జయదేవ్ కు చెందిన అమర రాజా బ్యాటరీస్ ను పర్యావరణ అనుమతుల పేరుతో వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో, ఏపీలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టబడితో అమర రాజా గ్రూప్ నిర్మించ తలచిన భారీ లిథియం-అయాన్ గిగా ఫ్యాక్టరీ తెలంగాణకు తరలిపోయిందని ఆరోపణలు వచ్చాయి.

ఇక, ఇదే బాటలో దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం కూడా జగన్ దెబ్బకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయిందని నారా లోకేశ్ పలుమార్లు ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు దిగ్గజ ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నాయి.

సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి ఏపీ నుంచి వెళ్లిన కంపెనీ ఇప్పుడు రాష్ట్రంలో తమ సంస్థల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐబీఎం కూడా విశాఖకు తరలి రాబోతోంది. ఈ ప్రకారం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎన్టీపీఐ)లో ఐబీఎం తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ‘వెల్కం ఐబీఎం’ అంటూ తమ ఎక్స్ ఖాతాలో ఎన్టీపీఐ పోస్ట్ చేసింది.

విశాఖలో రాబోయే మూడేళ్లలో దాదాపు 321 కోట్ల విలువైన ఉత్పత్తులు ఐబీఎం ఎగుమతి చేయనుంది. తద్వారా 502 మందికి స్థానికంగా ఉపాధి లభించనుంది. విశాఖలో ఐబీఎం కోసం అనువైన స్థల సేకరణ మొదలైందని, ఆఫీసు ఏర్పాటుకు ఏర్పాట్లు మొదలయ్యాయని తెలుస్తోంది.

వాస్తవానికి వైసీపీ హయాంలో విశాఖలోని రుషికొండ హిల్-3పై ఐబీఎం కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఎక్కువ మందికి ఉపాధి చూపించాలన్న నిబంధన నేపథ్యంలో ఐబీఎం 3.20 ఎకరాలు మాత్రమే తీసుకుంది. 21.80 ఎకరాలను ఏపీఐఐసీకి తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత పరిణామాలతో ఐబీఎం తమ సంస్థ భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు అమ్మేసి ఏపీకి గుడ్ బై చెప్పింది. ఆ 21.80 ఎకరాలను కూటమి ప్రభుత్వం టీసీఎస్ కు కేటాయించింది.

మరోవైపు, ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ కు భూమి కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఎండాడలో 20 ఎకరాలను ఆ సంస్థకు ఇచ్చేందుకు అధికారులు గుర్తించారు. చర్చలు పూర్తయితే స్థలం కేటాయింపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్, సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ మాదిరిగా వేలాదిమంది ఐటీ ఉద్యోగులతో విశాఖ తీరం కొలువుదీరనుంది.

Related Post

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలివేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది, ప్యారడైజ్ మార్చి నెలని వదలేశాక ఆ స్లాట్ ని ఎవరు వాడుకుంటారో అర్థం కావడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్

చిరంజీవిని తెలంగాణ నుంచి వెళ్లిపొమ్మ‌న్నారా?చిరంజీవిని తెలంగాణ నుంచి వెళ్లిపొమ్మ‌న్నారా?

తెలంగాణ ఉద్య‌మం ఉద్ధృతంగా ఉన్న స‌మ‌యంలో ఆంధ్రా వారిని ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని తెలంగాణ వాదులు, ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు గొడ‌వ చేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. సినీ జ‌నాల మీద కూడా ఈ ర‌క‌మైన దాడులు జ‌రిగాయి. టీఆర్ఎస్ పార్టీ

అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)…బీజేపీ హ్యాట్రిక్ విజయాల వెనుక ఉన్న శక్తి. చాలామంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ నడుస్తుందని, చాలా టికెట్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రికమండేషన్ పై