hyderabadupdates.com movies సుధీర్ బాబుకి జటిలమైన పరీక్ష

సుధీర్ బాబుకి జటిలమైన పరీక్ష

ఈ వారం విడుదలవుతున్న వాటిలో బడ్జెట్ పరంగా పెద్ద సినిమా జటాధరనే. సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ హారర్ కం డివోషనల్ డ్రామా కోసం బాలీవుడ్ నిర్మాతలు గట్టిగానే ఖర్చు పెట్టారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు మనసు విప్పి మాట్లాడిన నిజాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. లేనిపోని భేషజాలు హీరోయిజం చూపించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేసి తను ఎంత కష్టపడింది చెప్పుకొచ్చాడు. అయితే జటాధరకు బయట పెద్దగా బజ్ లేదు. ట్రైలర్ విజువల్స్ బాగానే ఉన్నా జనాలకు పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయాయి.

ఈ నేపథ్యంలో దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సుధీర్ బాబుకి బాక్సాఫీస్ వద్ద జటిలమైన పరీక్షే ఎదురు కానుంది. ఎందుకంటే జటాధరా సోలోగా రావడం లేదు. కాంపిటీషన్ లో రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ ఉంది. దీని మీద హీరోయిన్ ఇమేజ్, జానర్ ఎఫెక్ట్ వల్ల ఓ మోస్తరు బజ్ ఉంది. విష్ణు విశాల్ డబ్బింగ్ మూవీ ఆర్యన్ మీద హైప్ రావడం అనుమానమే. తిరువీర్ ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా హైప్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. సో ఎలా చూసుకున్నా మాస్ ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయస్ అయ్యేందుకు జటాధరాకు అవకాశాలున్నాయి. కాకపోతే టాక్ పాజిటివ్ గా రావాల్సిన అవసరం చాలా ఉంది.

ఇది కనక నెగ్గితే సుధీర్ బాబుకి మళ్ళీ మార్కెట్ ఓపెనవుతుంది. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. హరోంహర ఒకటే కొంచెం పర్వాలేదనిపించుకుంది కానీ మరీ అద్భుతాలేం చేయలేదు. సో జటాధరా సక్సెస్ అయితే తిరిగి అవకాశాలు ఊపందుకుంటాయి. ఈసారి మహేష్ బాబు మద్దతు తీసుకోకుండా స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్న సుధీర్ బాబు ఇతర బాషల డబ్బింగ్ వెర్షన్ల మీద కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సోనాక్షి సిన్హా విలన్ కం హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న జటాధరకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

Related Post

Jana Nayagan box office: Vijay swan song clocks Rs. 50 crore advances worldwideJana Nayagan box office: Vijay swan song clocks Rs. 50 crore advances worldwide

The Tamil film Jana Nayagan is registering sensational pre-sales both domestically and overseas. Vijay starrers are known to open massively, and with this film marking his swan song before he

నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

నంది అవార్డులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండేవో ముందు తరం వారికి బాగా తెలుసు. ఈ అవార్డును అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావించేవారు సినీ జనాలు. సినిమాలతో పాటు టీవీ, నాటక రంగాలకు కూడా నందులు ఇచ్చి గౌరవించేవి అప్పటి ప్రభుత్వాలు.