hyderabadupdates.com movies సూపర్ స్టార్ కొడుకు జీతం రూ.4500

సూపర్ స్టార్ కొడుకు జీతం రూ.4500

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను కట్టే ఇండియన్ హీరోగా రికార్డు కూడా నెలకొల్పాడు. అలాంటి హీరో కొడుకు కేవలం రూ.4500 జీతానికి పని చేస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇదే నిజం అంటున్నాడీ సీనియర్ హీరో. అక్షయ్, ట్వింకిల్ ఖన్నాలకు ఇద్దరు పిల్లలు కాగా.. అందులో పెద్దవాడు ఆరవ్ కుమార్.

అక్షయ్ పెద్ద స్టార్ కాబట్టి ఆటోమేటిగ్గా తన కొడుకు కూడా సినిమాల్లోకే వస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ తన కొడుక్కి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అక్షయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అతను ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ దిశగా అవగాహన పెంచుకునేందుకు గాను ఆరవ్ గ్రామాల్లో తిరుగుతున్నాడని.. కేవలం రూ.4500 జీతానికి పని చేస్తున్నాడని అక్షయ్ వెల్లడించాడు.

ఆరవ్ చాలా విషయాల్లో తనలాగే ఉంటాడని, కొన్ని విషయాల్లో మాత్రమే భిన్నంగా కనిపిస్తాడని అక్షయ్ చెప్పాడు. తనలాగే అతడికీ ఆరోగ్యం, ఆహారం మీద ఎంతో శ్రద్ధ ఉందని.. కానీ తనలా అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం మాత్రం లేదని అక్షయ్ స్పష్టం చేశాడు.

ఆరవ్‌కు సింపుల్‌గా ఉండడం ఇష్టమని, సెలబ్రెటీ లైఫ్‌ను కోరుకోడని.. తనకు ఇష్టమైన ఫ్యాషన్ రంగంలో పని చేయడానికి ఇష్టపడుతున్నాడని చెప్పాడు. ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్లి రకరకాల ప్రింట్లు, ఫ్యాషన్ డిజైన్ల గురించి స్వయంగా నేర్చుకుంటున్నట్లు అక్షయ్ తెలిపాడు.ఆరవ్ మంచి కుక్ కూడా అని ఆయన చెప్పాడు.

తాను కొడుక్కి పెద్దగా లెక్చర్లు ఇవ్వనని.. అతడికి ఇచ్చే ఏకైక సలహా ‘ఎవరికీ హాని చేయవద్దు’ అని మాత్రమేనని అక్షయ్ పేర్కొన్నాడు. అక్షయ్ కొడుకు ఎలాగూ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించబోనని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన తనయురాలు నిటారా అయినా ఈ రంగం వైపు అడుగులేస్తుందేమో చూడాలి. అక్షయ్ లీడ్ రోల్ చేసిన ‘భూత్ బంగ్లా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Related Post

Since We’re Reliving 2016, Here Are Some Things We’d Love To Bring Back In 2026Since We’re Reliving 2016, Here Are Some Things We’d Love To Bring Back In 2026

Somewhere between blockbusters Rockstar and Jab We Met reruns popping back into our cinema watchlists, a Charlie Puth video casually captioned “Heard it was 2016 again?”, and grainy photo dumps

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అంబటి ఇంటిపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త దాడి చేయించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు