hyderabadupdates.com movies సూపర్ స్టార్ సినిమాకు దర్శకులే దొరకలేదా?

సూపర్ స్టార్ సినిమాకు దర్శకులే దొరకలేదా?

జైలర్ 2 తర్వాత రజినీకాంత్ చేయబోయే సినిమా మీద సందిగ్ధం ఇంకా తొలగలేదు. కమల్ హాసన్ నిర్మాతగా తలైవర్ రెండు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సుందర్ సి దర్శకుడిగా లాక్ చేసుకుని వీడియో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కొద్దిరోజులయ్యాక అందరికీ షాక్ ఇస్తూ అతను వెనుదిరిగాడు.

తర్వాత పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు వినిపించింది. అఫీషియల్ కాకపోవడంతో ఫ్యాన్స్ అయోమయం చెందారు. ఇప్పుడు డ్రాగన్ తీసిన అశ్వత్ మరిముత్తు ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేయబోతున్నాడనే ప్రచారం చెన్నై వర్గాల్లో ఊపందుకుంది. దీనికీ అధికారిక ముద్ర లేదు.

నిజానికి ఇలాంటి సిచువేషన్ రజినికి ఎప్పుడూ రాలేదు. ఆరోగ్య కారణాల దృష్ట్యా సినిమాల వేగం తగ్గించాలని చూస్తున్న ఈ సూపర్ స్టార్ ఇంకో మూడు నాలుగు సంవత్సరాలలో రిటైర్ మెంట్ ప్రకటన ఇవ్వొచ్చనే గాసిప్ ఆల్రెడీ మొదలయ్యింది. అందుకే కెరీర్ చివర్లో చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట.

కూలి ఫలితం తర్వాత లోకేష్ కనగరాజ్ ని నిర్మొహమాటంగా పక్కన పెట్టడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. జైలర్ 2 వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల కానుంది. షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతున్నప్పటికీ మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్స్ ఇస్తున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

ముందు రజని సోలో మూవీ సంగతి తేలితే తప్ప కమల్ రజని మల్టీస్టారర్ ఒక కొలిక్కి రాదు. ఈ ఇద్దరినీ బాలన్స్ చేయగల సమర్థుడు ఎవరున్నారో అర్థం కాక అభిమానులు తెగ ఖంగారు పడుతున్నారు. రాజమౌళి లాంటి వాళ్ళు చేయగలరు కానీ ఆయన కమిట్ మెంట్స్, సినిమా తీయడానికి తీసుకునే సమయం పరిగణనలోకి తీసుకుంటే సెట్స్ పైకి వెళ్లడం కష్టం.

రజనీకాంత్ టార్గెట్ ఒకటే. వీలైనంత త్వరగా తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీతో సినిమా ఇచ్చే డైరెక్టర్లు కావాలి. ఒక్క నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే ఆయన అంచనాను అందుకున్నారు. మరి నెక్స్ట్ లిస్టులో ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.

Related Post

Heaven Glisson double-murder-suicide: Could swifter police action have saved lives?Heaven Glisson double-murder-suicide: Could swifter police action have saved lives?

Content warning: This article describes intimate partner violence. Please take care while reading. After the shocking double-murder-suicide that left Heaven Glisson, her ex-fiancé Donald Bryant, and neighbor Daylon Bradford dead

పెద్ద ముప్పు తెచ్చి పెట్టనున్న దురంధర్ 2పెద్ద ముప్పు తెచ్చి పెట్టనున్న దురంధర్ 2

నిన్నటిదాకా బాలీవుడ్ వర్గాల్లో వినిపించిన మాట దురంధర్ 2 విడుదల ముందు ప్రకటించినట్టు మార్చి 19 ఉండదని. కానీ ఇప్పుడు స్వరం మారిపోయింది. ఖచ్చితంగా అదే డేట్ కి వస్తున్నట్టు పలు వర్గాల ద్వారా టీమ్ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారునవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి చేసిన కృషి చిన్నది కాదు. మంచి కంటెంట్ జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద వీళ్ళు చూపించే శ్రద్ధ