hyderabadupdates.com Gallery సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు post thumbnail image

హైద‌రాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బ‌తికే ఉంటార‌ని అన్నారు ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం అన్నారు. అవి ఎన్టీఆర్‌లో ఉండేవని చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఆయన బతికే ఉంటారని చెప్పారు. సినిమాల్లో ఎవరూ చేయని పాత్రలు ఎన్టీఆర్‌ చేశారని గుర్తు చేశారు.
ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారని కొనియాడారు. తెదేపాను స్థాపించి సంచలనం సృష్టించారని, ఇది ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింద‌న్నారు బాల‌కృష్ణ‌. కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు చేయూత అందించారని తెలిపారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారని చెప్పారు . పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు ఆయన. అప్పట్లో ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన పథకాలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయ‌ని, ఇది త‌న తండ్రికి ద‌క్కుతుంద‌న్నారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారని చెప్పారు. తెలుగు గంగ, గాలేరు నగరిలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారని అన్నారు. ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తోందని బాలకృష్ణ అన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి గుండెచప్పుడు, కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌ అని కొనియాడారు.
The post సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

సెరియా : ప్ర‌పంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపుల‌ర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జ‌కోవిచ్. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మ‌రో రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ నిర్వాకంపై , అనుస‌రిస్తున్న విధానాల‌పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శ‌నివారం

భ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వంభ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వం

తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు