hyderabadupdates.com movies సూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారు

సూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారు

పొంగల్ పండగ సందర్భంగా సెన్సార్ వివాదాలను ఎదురుకుని తమిళంలో విడుదలైన పరాశక్తి ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పేరుకు వంద కోట్ల గ్రాస్ వచ్చింది కానీ బడ్జెట్, బిజినెస్ కోణంలో చూసుకుంటే ఇది చాలా చిన్న మొత్తం. శివ కార్తికేయన్, రవి మోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా తమిళ ఆడియన్స్ కి నచ్చలేదు.

ఒకప్పుడు ఆ రాష్ట్రాన్ని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ, దర్శకురాలు సుధా కొంగర దాన్ని ఇప్పటి జనరేషన్ కు అర్థమయ్యేలా చెప్పడంలో ఫెయిలయ్యారు. దీంతో భారీ ఖర్చుతో తీసిన గ్రాండియర్ కష్టం వృథా అవుతోంది.

నిజానికి ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయినప్పుడు ముందు అనుకున్న క్యాస్టింగ్ వేరు. సూర్య, దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఫహద్ ఫాసిల్, నజ్రియా ఇందులో భాగమయ్యారు. కానీ ప్రొడక్షన్ కు వెళ్ళడానికి ముందే ఇది ఆగిపోయింది.

ఆకాశం నీ హద్దురా లాంటి కల్ట్ ఇచ్చిన సుధా కొంగర మీద సూర్యకు నమ్మకమున్నా, కాంట్రవర్సి సబ్జెక్టు కాబట్టి లేనిపోని తలనెప్పులు వస్తాయని భావించి తప్పుకున్నట్టు అప్పటి చెన్నై కథనాలు వచ్చాయి. తర్వాత విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. కింగ్డమ్ లో బిజీగా ఉన్న రౌడీ బాయ్ సున్నితంగా నో చెప్పాడు. ఇలా ఎన్నో చక్కర్లు కొట్టింది.

ఫైనల్ గా కథ సుఖంతమయ్యింది కానీ ఆశించిన రిజల్ట్ రాకపోవడం కోలీవుడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది. జన నాయకుడు వాయిదాని ఫుల్ గా క్యాష్ చేసుకుంటుందని భావిస్తే దానికి రివర్స్ లో ఇంత నెమ్మదిగా వసూళ్లు తేవడం బయ్యర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

దీనికన్నా అసలు పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన రంగం హీరో జీవా సినిమా హిట్టు దిశగా దూసుకుపోతోంది. నిర్మాత జాక్ పాట్ కొట్టినట్టు ఫీలవుతున్నాడు. అన్నట్టు పరాశక్తి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంతకు ముందే సిద్ధం చేసి ఉంచారు కానీ ఇప్పుడది విడుదల చేస్తారో లేదో అనుమానంగానే ఉంది. ఇప్పటికే బజ్ లేదు. ఇంకా ఆలస్యం చేస్తే అంతే సంగతులు.

Related Post

Chiru starts the action spectacle Prabhas and Sandeep’s SpiritChiru starts the action spectacle Prabhas and Sandeep’s Spirit

The powerhouse collaboration of India’s biggest star Prabhas and sensational filmmaker Sandeep Reddy Vanga has officially commenced, with their film SPIRIT going on floors. The much-awaited muhurat ceremony was a

సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన సొంత పార్టీపై అయినా..విపక్షాలపై అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నేత