hyderabadupdates.com movies సెంటిమెంట్ స్టోరీలు చెబుతున్న ఐబొమ్మ రవి

సెంటిమెంట్ స్టోరీలు చెబుతున్న ఐబొమ్మ రవి

ఇమ్మడి రవి.. వారం ముందు వరకు ఈ పేరు గురించి మన జనాలకు పరిచయమే లేదు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో ఈ పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొన్నేళ్లుగా తెలుగు పైరసీ వీడియోలతో కోట్లాదిగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఐబొమ్మ వెబ్ సైట్‌ను నడిపిస్తున్నది ఇతనే.

కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకుని అక్కడి నుంచే ఐబొమ్మ సైట్‌ను నడిపిస్తూ.. పలు దేశాల్లో బ్యాకప్ సర్వర్ల ద్వారా పెద్ద ఎత్తున పైరసీ నెట్వర్క్‌ను డెవలప్ చేశాడు ఈ రవి. యుక్త వయసులోనే హ్యాకింగ్ మీద పట్టు సాధించి.. నేరుగా థియేటర్ యాజమాన్యాల సర్వర్లలోకి వెళ్లి ఇంకా రిలీజ్ కాని సినిమాలను సైతం పైరసీ చేసి ఆన్ లైన్లో లీక్ చేసే స్థాయికి వెళ్లిపోయాడతను. కొన్ని రోజుల కిందటే హైదరాబాద్‌కు వచ్చిన రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో భాగంగా పోలీసులకు అతను సెంటిమెంట్ స్టోరీలు చెబుతున్నట్లు వెల్లడైంది. తాను ఇలా తయారు కావడానికి తన భార్య, అత్తనే కారణమని అతను చెప్పాడట. తాను ఒకప్పుడు వెబ్ డిజైనర్ అని.. చాలీ చాలని ఆదాయంతో బతికేవాడినని.. అప్పుడు తన భార్య, అత్త తనను తక్కువగా చూసేవారని.. సూటి పోటి మాటలు అనేవారని.. డబ్బు లేకపోవడం వల్ల తాను అనేక అనుమానాలు ఎదుర్కొన్నానని అతను చెప్పుకొచ్చాడట. దీంతో తనలో కసి పెరిగి హ్యాకింగ్ మీద పట్టు సాధించి సినిమాలను పైరసీ చేయడం మొదలుపెట్టానని.. ఈ క్రమంలోనే ఒకేసారి రూ.75 లక్షలు సంపాదించానని అతను వెల్లడించాడట.

ఐతే డబ్బులు సంపాదించుకుని వచ్చాక కూడా తన భార్య, అత్తలో మార్పు రాలేదని.. తనను అవమానించడం ఆపలేదని.. తానంటే వాళ్లకు చులకనభావం పోలేదని.. తనను వదిలించుకోవాలని అంతకుముందే అనుకోవడంతో వారిలో మార్పు రాలేదని.. ఐతే సినిమాలను పైరసీ చేయడం ద్వారా బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తాను అందులో కూరుకుపోయానని.. దాన్నే కొనసాగించానని రవి చెప్పినట్లు సమాచారం. తాను పోలీసులకు దొరికిపోవడానికి కూడా తన భార్య, అత్తలే కారణమని తనకు తెలుసని కూడా రవి అభిప్రాయపడ్డాడట. ఐతే తప్పు చేసే ప్రతి ఒక్కరూ ఇలాంటి సెంటిమెంట్ స్టోరీలు చెప్పడం సహజమే, కారణాలు ఏవైనా అతను చేసింది ఘోరమైన తప్పు అనడంలో సందేహం లేదు.

Related Post

టీడీపీలో కోవర్టులు: చింతమనేనిటీడీపీలో కోవర్టులు: చింతమనేని

టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా తాను చెప్పాలనుకున్న మాటలను చెప్పేసే ముక్కుసూటి నైజం చింతమనేని సొంతం. అదే తరహాలో, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో

రాజధాని రైతులకు భరోసా… ఆరు నెలల్లోగా..?రాజధాని రైతులకు భరోసా… ఆరు నెలల్లోగా..?

రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌న్నీ ఆరునెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది. స్వార్ధం కోసం ఒక‌రిద్ద‌రు చెప్పే మాట‌లు ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని క‌మిటీ స‌భ్యులు సూచించారు. ప్ర‌తి రెండు వారాల‌కోసారి స‌మావేశ‌మై రైతుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేలా ముందుకెళ్తామ‌ని క‌మిటీ తెలిపింది. రాజ‌ధాని