hyderabadupdates.com Gallery సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం post thumbnail image

చెన్నై : చెన్నై వేదిక‌గా గురువారం జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు సమిష్టిగా రాణించింది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిలో 72 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరుకునేందుకు వీలవుతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు భారీ స్కోరు న‌మోదు చేసింది. కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 256 ప‌రుగులు చేసింది. పొట్టి ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ఇది అరుదైన రికార్డ్ టీమిండియా త‌ర‌పున‌.
సంజూ శాంస‌న్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శ‌ర్మ రెచ్చి పోయాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. ఇషాన్ కిష‌న్ ఎప్ప‌టి లాగే దుమ్ము రేపాడు. త‌ను 38 ర‌న్స్ చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ 44 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నారు. చివ‌ర‌గా వ‌చ్చిన హార్దిక్ పాండ్యా రెచ్చి పోయాడు. త‌ను 50 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం 257 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే జ‌ట్టు స్కోర్ ను ఛేదించ‌లేక బౌల‌ర్ల ధాటికి త‌ట్టుకోలేక చ‌తికిల ప‌డింది. అయితే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును 100 ర‌న్స్ లోపే ఆల్ అవుట్ చేస్తుంద‌ని అనుకుంటే కేవ‌లం 72 ప‌రుగుల తేడాతో ఓడించింది. మొత్తంగా భార‌త్ సెమీస్ ఆశ‌లు ఈ విజ‌యంతో నిలుపుకుంది.
The post సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలుReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు

  గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో

చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవ‌రైనా స‌రే చైనాకు చెందిన మాంజాల‌ను వాడితే, లేదా ఉప‌యోగించినా కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja

Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్

    శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్‌‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన