hyderabadupdates.com movies సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని మించిన వేడుక ఉండదు అనడంలో మరో మాట లేదు. మధ్య తరగతి జనాలే తమ స్థాయికి మించి, ఎంతో ఘనంగా వివాహ వేడుకలు చేసుకుంటున్న ఈ రోజుల్లో బిగ్ షాట్స్ ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో చెప్పేదేముంది?

ఫిలిం సెలబ్రెటీలు కొన్ని రోజుల పాటు ఘనంగా వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుని.. రిసెప్షన్లు పెట్టుకుంటున్నారు. మీడియా, సోషల్ మీడియా దృష్టి కూడా వీటిపై బాగానే ఉంటోంది. సెలబ్రెటీల పెళ్లిళ్లు జరిగేన్ని రోజులూ ఆ వార్తే హైలైట్ అవుతోంది. కానీ ఇలా ఘనంగా వివాహాలు చేసుకునే చాలామంది కొన్నేళ్లకే విడిపోతుండడం.. అభిమానులను నిరాశపరుస్తోంది. గత కొన్నేళ్లలో విడాకులు తీసుకున్న సినీ జంటలకు లెక్కే లేదు. తాజాగా నటి హన్సిక విడాకుల బాట పట్టింది.

హన్సిక నాలుగేళ్ల కిందట సోహెల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తన పెళ్లి వేడుకకు సంబంధించి వీడియో రైట్స్ ఆమె ఒక ఓటీటీ సంస్థకు ఇచ్చింది. ఇప్పటికీ ఆ వీడియోను అక్కడ చూడొచ్చు. పెద్ద సెలబ్రెటీ అయి ఉండి.. ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. సోహెల్.. హన్సిక స్నేహితురాలి భర్త కావడం గమనార్హం. ఇద్దరూ ఇష్టపడి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని మూడేళ్ల లోపే విడిపోయారు.

ఏడాదికి పైగా భర్తకు దూరంగా ఉంటున్న హన్సిక ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకుంది. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని ఇంత త్వరగా విడాకులు తీసుకోవడం హన్సిక అభిమానులను బాధిస్తోంది. టాలీవుడ్లో నాగచైతన్య, సమంత జంట పెళ్లి ఎంత వేడుకగా జరిగిందో తెలిసిందే. కానీ ఆ జంట నాలుగేళ్లకే విడిపోవడంతో జనం ఎంతగానో ఫీలయ్యారు.

తాజాగా మరో సెలబ్రెటీ జంట విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకోవడం వ్యక్తిగత విషయమే అయినా.. ఈ విషయంలో అభిమానులు ఫీలవుతున్నారు. ఎవరు ఎన్నాళ్లు కలిసుంటారో తెలియట్లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా దృష్టిలో అతిగా పడకుండా.. వీలైనంత సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని.. మరీ హడావుడి చేయకపోతే మంచిదనే చర్చ జరుగుతోంది.

Related Post

3 South Movies Releasing in Theatres This Week (January 5 to 11): Jana Nayagan, Parasakthi and The Raja Saab3 South Movies Releasing in Theatres This Week (January 5 to 11): Jana Nayagan, Parasakthi and The Raja Saab

Cast: Prabhas, Sanjay Dutt, Malavika Mohanan, Nidhhi Agerwal, Riddhi Kumar, Boman Irani, Zarina Wahab, Samuthirakani, Vennela Kishore Director: Maruthi Language: Telugu Genre: Romantic Fantasy Horror Comedy Release Date: January 9,