hyderabadupdates.com movies సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2 వాయిదా పడటంతో చాలా చోట్ల అవసరమైన దానికన్నా ఎక్కువ షోలు మల్టీప్లెక్సుల్లో దీనికి కేటాయిస్తున్నారు. రివ్యూలు, పబ్లిక్ టాక్ చూసిన ఆడియన్స్ ఇదేదో బాగుందంటూ వెళ్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అంతగా ఏముందంటే మమ్ముట్టి పూర్తిగా ఒక నెగటివ్ పాత్ర చేయడం హైలైట్ గా చెప్పొచ్చు. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీలోలుడు సైకో పాత్ కిల్లర్ గా హత్యలు చేయడం, దాన్ని కనిపెట్టే క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ కనుక్కున్న విస్తుపోయే నిజాలు ఇందులో ప్రధాన కథాంశం.

గతంలో స్వలింగ సంపర్కుడిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసిన మమ్ముట్టి ఈసారి ఏకంగా సైకో కిల్లర్ గా నటించడం షాకే, నాలుగు వందలకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో కొత్త జానర్ల కోసం ప్రయత్నిస్తున్న ఈ విలక్షణ నటుడు వయసును సైతం లెక్క చేయకుండా ఎనర్జిటిక్ గా కలం కవల్ లో నటించడం విశేషం. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ ని కొంచెం స్ఫూర్తిగా తీసుకున్న దర్శకుడు జితిన్ కె జొస్ స్క్రీన్ ప్లే నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ అయ్యేలోగా ప్రేక్షకులను సంతృప్తి పర్చడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.

ఇది తెలుగులో డబ్ అవుతుందో లేదో చెప్పలేం కానీ ఓటిటిలో వచ్చాక మాత్రం మనోళ్లు ఎగబడి చూడటం ఖాయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జైలర్ విలన్ వినాయకన్ ఇందులో పాజిటివ్ గా పోలీస్ వేషంలో కనిపించడం. మమ్ముట్టితో కాంబినేషన్ సీన్లు బాగా పండాయి. ఇంటెన్స్ గా డిజైన్ చేసిన విధానం ప్రశంసలు అందుకుంటుంది. అలాని కథనం పరుగులు పెడుతుందని కాదు. మలయాళం సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకు ఇది కొత్తగానే ఉంటుంది కానీ లేదంటే కొంచెం ల్యాగ్ ఫీలవ్వడం ఖాయం. ఇలాంటివి మన హీరోలు చేస్తే జనాలు అంత సులభంగా అంగీకరించరు కాబట్టి అనువాదంతో సరిపెట్టుకోవాల్సిందే.

Related Post

అమరావతి రైతులు… హ్యాపీనా?అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించిన సీఎం చంద్ర‌బాబు.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికి మూడు సార్లు రైతుల‌తో కేంద్ర

కేసీఆర్ సారు… మీ వాళ్ళని ఇరకాటంలో పడేసారేకేసీఆర్ సారు… మీ వాళ్ళని ఇరకాటంలో పడేసారే

కోనసీమ కొబ్బరి చెట్ల గురించి తెలంగాణ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారని, కోనసీమకు దిష్టి తగిలిందని, కోనసీమ ప్రాంతం వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందేమో అని తనకు అనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ

మంత్రి లోకేష్ ఖర్చులకు ప్రభుత్వ నిధులు వాడుతున్నారా?మంత్రి లోకేష్ ఖర్చులకు ప్రభుత్వ నిధులు వాడుతున్నారా?

ఏపీ మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ప్ర‌భుత్వం అధికారికంగా స‌మాధానం చెప్పింది. ఆయ‌న ఖ‌ర్చుల‌ను ఆయ‌నే పెట్టుకుంటున్నార‌ని.. స‌ర్కారు ఖ‌జానా నుంచి రూపాయి కూడా తీసుకోవ‌డం లేద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు స‌మాచార