hyderabadupdates.com movies సౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూ

సౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూ

మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్ నెల రోజులకే డిజిటల్ లో వచ్చినా దాని తాలూకు సౌండ్ సోషల్ ఆన్ లైన్లో పెద్దగా లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు మెగాస్టార్ గురించి, వసూళ్ల గురించి క్రమం తప్పకుండా ట్వీట్లు, ఎలివేషన్లు గుప్పించిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు సైలెంటయ్యారు.

వర్కింగ్ డేస్ లో పీక్ గా చెప్పుకునే బుధవారం ప్రీమియర్ చేయడం వల్ల రెస్పాన్స్ కొంచెం తక్కువగా ఉండొచ్చనేది ఒక విశ్లేషణ. ఆల్రెడీ పండగ టైంలో అత్యధిక శాతం చూసేశారు కాబట్టి మళ్ళీ అర్జెంట్ గా స్మార్ట్ స్క్రీన్ మీద చూడాలనే తాపత్రయం తగ్గిందేమో.

ఇప్పుడే కాదు గత నెల మన శంకరవరప్రసాద్ గారు మెయిన్ రిలీజ్ జరుపుకుంది కూడా సోమవారమే. వీకెండ్ అయ్యాక విడుదల చేయడంతో హౌస్ ఫుల్స్ భారీగా పడ్డా దానికొచ్చిన హిట్ టాక్ కు తగ్గట్టు మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ రాలేదు. పదహారు కోట్ల దూరంలో ఆగిపోయింది.

ఒకవేళ శుక్ర లేదా శనివారం వచ్చి ఉంటే లెక్క ఖచ్చితంగా వేరుగా ఉండేది. అంటే థియేటర్, ఓటిటి రెండింటిలోనూ వరప్రసాద్ రాంగ్ స్ట్రాటజీ పాటించాడు. హక్కులు కొన్న జీ5 సంస్థ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తోంది. హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో అభిమానుల సంబరాల్లో భాగం పంచుకుని దాన్ని పబ్లిసిటీ కోసం చక్కగా వాడుకుంటోంది.

డిజిటల్ లో వదిలేశాం కదా జనాలు వాళ్లే చూస్తారులే అని తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే హీరో ఎవరైనా వాళ్ళ కొత్త సినిమాలకు ఓటిటి రెస్పాన్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి తర్వాతి సినిమాల రేట్లు డిసైడ్ చేస్తారు. అందుకే దర్శక నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

థియేటర్ లో ఇంకా ఆడుతుండగానే ఓటిటికి ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ లో అసంతృప్తి అయితే ఉంది. ఇంకో వారం పది రోజులు ఆగి ఉంటే మరో వీకెండ్ ప్లస్ అయ్యేదని, ఇప్పుడా అవకాశం లేదని ఫీలవుతున్నారు. వ్యూస్ కు సంబంధించిన లెక్కలు ఓటిటి చెప్పే దాకా క్లారిటీ రాదు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

Related Post

‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు

జూబ్లీహిల్స్ పోరు: బీసీకి కాంగ్రెస్ టికెట్‌.. నవీన్ సత్తా ఏంటి ?జూబ్లీహిల్స్ పోరు: బీసీకి కాంగ్రెస్ టికెట్‌.. నవీన్ సత్తా ఏంటి ?

హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఎన్నిక‌ల పోరుకు రంగం రెడీ అయింది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. వ‌చ్చే నెల 11 న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే నెల 14న రిజ‌ల్ట్