hyderabadupdates.com movies స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా కీలకం. ముఖ్యంగా టయర్ 2 హీరోలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిఖిల్ స్వయంభు ముందు అనుకున్న ప్రకారమైతే ఏప్రిల్ 10 విడుదల కావాలి. కానీ ఇప్పుడు దాన్ని మార్చుకుని ఏప్రిల్ 17 షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు యూనిట్ టాక్.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే టీజర్ వచ్చాక అంచనాలు పెరిగిన మాట వాస్తవమే కానీ వాటిని ఇంకా పూర్తి స్థాయిలో పెంచాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది. ఎందుకంటే ఏప్రిల్ లో అడివి శేష్ ‘డెకాయిట్’ ఉంది. దానికన్నా ముందు శర్వానంద్ ‘బైకర్’ వస్తుంది. వీటి పబ్లిసిటీతో మొదటి రెండు వారాలు హోరెత్తిపోతాయి. పాజిటివ్ టాక్స్ వస్తే సోషల్ మీడియా మద్దతు ఉంటుంది.

సో స్వయంభు సౌండ్ చేయాలంటే వాటికి ధీటుగా ప్రచారాలు తలకెత్తుకోవాలి. ముఖ్యంగా ట్రైలర్ మీద దృష్టి సారించాలి. బాహుబలి పోలికల గురించి టీజర్ టైంలో చర్చ జరిగింది. అలాంటి ఫీలింగ్ కలగని విజువల్స్ ని పొందుపరచాలి. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారమైతే స్వయంభులో స్టన్నింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయని, సరైన రీతిలో కనక వాటిని జనాలకు రిజిస్టర్ చేయగలిగితే ఫ్యామిలీస్ తోనే ఓపెనింగ్స్ వచ్చేస్తాయని అంటున్నారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 30 పెద్ది వస్తుంది కనక అంతకన్నా ముందే స్వయంభు వచ్చేయడం సేఫ్ అవుతుంది. రెండు వారాల స్పేస్ నిఖిల్ కు సరిపోతుంది. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే పెద్ది ఉన్నా సరే చెప్పుకొదగ్గ సంఖ్యలో స్క్రీన్లను కొనసాగించవచ్చు. వార్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన  స్వయంభులో యుద్ధవీరుడిగా నిఖిల్ రిస్కీ స్టంట్లు చాలానే చేశాడు.

Related Post

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది. త్యాగరాజ వీధికి చెందిన

7 South Releases to Watch on OTT This Week: Sanjana Dipu’s Roslin to Samuthirakani’s Thadayam7 South Releases to Watch on OTT This Week: Sanjana Dipu’s Roslin to Samuthirakani’s Thadayam

Cast: Samuthirakani, Sshivada, Raj Tirandas, Sundharpandyan, Prem, Kotravi, Karthi, Suparn Director: Navinkumar Palanivel Genre: Crime Thriller Runtime: TBA Language: Tamil Where to watch: ZEE5 Streaming Date: February 27, 2026 Thadayam