hyderabadupdates.com movies హరీష్‌ను పవన్ కొట్టింది అందుకా…

హరీష్‌ను పవన్ కొట్టింది అందుకా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దర్శకుడు హరీష్ శంకర్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ఆరాధ్య కథానాయకుడిని తనలాంటి అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు హరీష్. మళ్లీ ఈ ఇద్దరి కలయికలో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్’ సింగ్ రాబోతోంది.

ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు హరీష్. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, మేకింగ్ గురించి అనేక విశేషాలు పంచుకున్న హరీష్.. ఇటీవల రిలీజ్ చేసిన ఒక ప్రోమోలో తనను పవన్ కళ్యాణ్ నవ్వుతూ కొడుతున్న మూమెంట్ వెనుక ఏం జరిగిందో వెల్లడించాడు.

సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా పెద్దవాడైన ఒక వ్యక్తి హీరోకు దండం పెట్టి తన బాధ చెప్పుకుంటే.. దండం పెట్టిన ఆ చేతులను పట్టుకుని కిందికి దింపి, అలా దండం పెట్టకండి.. మీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాల్సి ఉంటుందట. ఈ సన్నివేశాన్ని ముందే పవన్‌కు వివరించి చెప్పాడట హరీష్. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా సీన్, డైలాగులను పవన్‌కు చెప్పాడట. ఐతే యాక్షన్ చెప్పాక.. అవతలి వ్యక్తి దండం పెట్టగానే నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్లుగా.. సీన్ ప్రకారం ఏ చేయాలో మరిచిపోయిన పవన్ దండం పెట్టేశాడని హరీష్ వెల్లడించాడు.

రాజకీయాల్లో ఇలా దండం పెట్టిన వాళ్ళందరికీ దండం పెట్టడం అలవాటై పవన్ అలా చేశాడని.. దీంతో తాను కట్ చెప్పి నవ్వుకుంటూ పవన్ దగ్గరికి వస్తే.. అసలు విషయం గుర్తించిన ఆయన రోజు అలా అలవాటయిపోయిందని తెలిపారట.

ఈ విషయం గుర్తొచ్చి రెండో పాట రిలీజ్ కు ముందు పవన్ ను టీమ్ సభ్యులు కలిసినప్పుడు హరీష్ నమస్కరించే సన్నివేశం గుర్తు చేస్తూ పవన్ ను ఆటపట్టించడంతో నవ్వుతూ హరీష్ ను కొట్టినట్టు అసలు విషయం వెల్లడించాడు హరీష్ శంకర్.

పవన్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల బాగా ఆలస్యమైన చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. 2024 ఎన్నికల తర్వాత వీలు చేసుకుని ముందుగా హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేసిన పవన్.. చివరగా ‘ఉస్తాద్..’కు డేట్లు ఇచ్చి ఆ సినిమా పని కూడా అవగొట్టాడు. ముందు వేసవి మధ్యలో రిలీజ్ అనుకున్నారు కానీ.. ‘పెద్ది’ వాయిదా పడడంతో ఆ డేట్‌ను ‘ఉస్తాద్’ కోసం తీసుకున్నారు.

Related Post

WTC: భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే..WTC: భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే..

సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ (0-2) అవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఆశలకు గండి కొట్టినట్టే. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ పోయింది. ఇప్పుడు WTC పాయింట్ల పట్టికలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్

Prasanth Varma’s Prabhas starrer Baka shelved after Hanu-Man and Rakshas troubles: ReportPrasanth Varma’s Prabhas starrer Baka shelved after Hanu-Man and Rakshas troubles: Report

The Prasanth Varma Cinematic Universe (PVCU) seems to be struggling these days. According to a report by Gulte, the star director’s much-awaited project, Baka, starring South Indian star Prabhas in