hyderabadupdates.com movies హాట్ ప్రియాంక మోహన్‌.. అవి ఒరిజినల్ కాదు

హాట్ ప్రియాంక మోహన్‌.. అవి ఒరిజినల్ కాదు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుణ్యమా అని.. సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు, వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని అయోమయం నెలకొంది. ఏ కొత్త సాంకేతికత వచ్చినా దాన్ని చెడు మార్గంలో ఉపయోగించడానికి చూసే వాళ్లు చాలామందే ఉంటారు. ఏఐని కూడా అలా వాడుతున్న వాళ్లకు కొదవ లేదు. ముఖ్యంగా కుర్రాళ్లు హీరోయిన్ల ఫొటోలను మార్ఫ్ చేయడానికి ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ట్రెడిషనల్ హీరోయిన్‌గా ముద్ర భామ ప్రియాంక అరుల్ మోహన్ ఫొటోలను.. చాలా హాట్‌గా తయారు చేసి సోషల్ మీడియాలోకి వదిలేశారు. ఇటీవలే ‘ఓజీ’ సినిమాతో పలకరించింది ప్రియాంక. అందులో ఒక పాటలో కొంచెం సెక్సీగా కనిపించింది ప్రియాంక. కానీ ఆమె హద్దులేమీ దాటిపోలేదు.

కానీ స్నానం చేసి వచ్చి చీరను చుట్టుకున్న లుక్‌తో హీరోతో రొమాన్స్ చేసే చిన్న సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని.. ఆమె బిహైండ్ ద సెట్స్ లుక్స్ అంటూ ఆమె హాట్ ఫొటోలను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. అవి ప్రియాంక స్వయంగా తీసుకున్న సెల్ఫీలంటూ ప్రచారం చేశారు. కెరీర్లో ఎన్నడూ హాట్ లుక్స్‌లో కనిపించని ప్రియాంక.. క్లీవేజ్ షో చేస్తూ సెల్ఫీలు దిగిందేంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.

తన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రియాంక స్పందించింది. ఆ ఫొటోలు ఒరిజినల్ కాదని, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ పిక్స్ అని ఆమె తేల్చేసింది. ఏఐని బాధ్యతాయుతంగా వాడాలని.. ఇలా ఫేక్ చేయడానికి కాదని.. వీటిని ఎవ్వరూ షేర్ చేయొద్దని ఆమె విన్నవించింది. వైరల్ అవుతున్న ఫొటోలను చూస్తే ఒరిజినల్ అని పొరబడే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇవి ఫేక్ అని ‘ఎక్స్’లో ‘గ్రోక్’ సైతం కన్ఫమ్ చేసింది. ఏఐని సరిగ్గా వాడకపోతే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇది ఉదాహరణ.

Related Post

రాజ్ కుమార్ అంటే పేరు కాదు… ఫైర్ !రాజ్ కుమార్ అంటే పేరు కాదు… ఫైర్ !

ఇప్పటి తరంలో శివరాజ్ కుమార్, రాజ్ కపూర్, డాక్టర్ రాజ్ కుమార్ లాంటోళ్ళు గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటారు కానీ బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన రాజ్ కుమార్ గురించి కూడా