hyderabadupdates.com movies అంత పెద్ద మాట ఎందుకు పెద్దాయనా

అంత పెద్ద మాట ఎందుకు పెద్దాయనా

నటకిరీటి రాజేంద్రప్రసాద్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఏముందో తాను చెప్పనని, ఒకవేళ చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని వేలాది మంది సమక్షంలో పబ్లిక్ గా శపథం చేశారు. మాములుగా రిలీజులకు ముందు అందులో నటించిన క్యాస్టింగ్ ఇలాంటి ప్రామిసులు చేయడం సహజం. గతంలో కొందరు యూత్ హీరోలు తమ సినిమా హిట్ కాకపోతే పేర్లు మార్చుకుంటామని, ఇంకేదేదో చేస్తామని అన్నవాళ్ళు లేకపోలేదు. కాకపోతే వాళ్లలో ఏ ఒక్కరు మాట మీద నిలబడలేదు. జస్ట్ ప్రమోషన్ల కోసం వేసుకున్న స్ట్రాటజీలో అలా మాట్లాడేస్తారు.

నిజంగా మాస్ జాతర బాగుండొచ్చు. అదేదో హిట్టయ్యాక నేను ఇది ఆడకపోతే పరిశ్రమకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నా అని రాజేంద్రప్రసాద్ అని ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంత పెద్ద మాట అనేసరికి అక్కడున్న వాళ్ళు ఒక్క క్షణం ఏంటి ఈయన నమ్మకం అని ఆశ్చర్యపోయారు. ఇలా కామెంట్స్ ద్వారా వార్తల్లో నిలవడం రాజేంద్రప్రసాద్ కు కొత్త కాదు. ఆ మధ్య రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ మీద వేసిన జోకులు, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీ మీద చేసిన హాస్యం లాంటివి మిస్ ఫైర్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతర వేడుకలో మరొకటి.

ఏది ఏమైనా ఇలాంటి సందర్భాల్లో రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్లు చాలా సంయమనంతో ఉండాలి. వదిలేసి వెళ్తా అని చెప్పడం ఈజీనే. కానీ ఒక బిజీ ఆర్టిస్టుగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ లు పెడుతున్న సినిమాల్లో ఈయన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంత తేలిగ్గా అనేస్తే లేనిపోని ట్రోలింగ్ ను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. మాస్ జాతరలో రాజేంద్రుడు హీరో రవితేజకు తాతయ్యగా నటించారు. వీళ్లిద్దరి బాండింగ్, ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్ ఉంది. బహుశా ఆ ఎగ్జైట్ మెంట్ లో ఇలా అనేశారేమో కానీ ఆయన పోతా అన్నా టాలీవుడ్, అభిమానులు అంత ఈజీగా వదలరు లెండి.

BIG STATEMENT From #RajendraPrasad:”#MassJathara చూసి మీరు SHOCK అవ్వకపోతే…నేను సినిమా Industry నుండి వెళ్ళిపోతా.” pic.twitter.com/BY5v5qzfF3— Gulte (@GulteOfficial) October 28, 2025

Related Post

Police Book Lulu Mall, Organisers After Crowd Chaos at Nidhhi Agerwal EventPolice Book Lulu Mall, Organisers After Crowd Chaos at Nidhhi Agerwal Event

Hyderabad police have registered a suo motu case against the management of Lulu Mall and the organisers of a promotional event following a serious crowd control lapse at Kukatpally Housing