hyderabadupdates.com movies అంత బీజీలోనూ ప్రజాదర్బార్ కొనసాగించుతున్న మంత్రి లోకేష్

అంత బీజీలోనూ ప్రజాదర్బార్ కొనసాగించుతున్న మంత్రి లోకేష్

ప్రజల సమస్యలు వినడం మరియు పరిష్కార మార్గం చూపడంలో మంత్రి నారా లోకేష్ చొరవ చూపుతున్నారు. తాడేపల్లిలోనే కాదు ఎక్కడ ఉన్నా స్థానిక పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ఆయన పద్ధతిగా మారింది. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.

విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో నిన్నంతా లోకేష్ బిజీగానే ఉన్నారు. సదస్సు తొలి రోజున విద్య మరియు ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

రాత్రిపూట సదస్సుతో బిజీగా గడిపిన మంత్రి లోకేష్ ఈ రోజు ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి వినతులను స్వీకరించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది ఆయన నిర్వహించిన డెబ్బై రెండవ ప్రజాదర్బార్. ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఎక్కడ ప్రజాదర్బార్ జరిగినా జనం పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఇందుకు నిదర్శనం. ఒక ట్వీట్ చేస్తే కూడా లోకేష్ వెంటనే స్పందిస్తారనే నమ్మకం ప్రజల్లో పెరిగింది.

ఈ రోజు ప్రజాదర్బార్ లో పలువురు తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చిననడిపిల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు తమ 5.64 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు.

జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని మరియు తమకు అండగా నిలవాలని నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జండర్ పర్సన్స్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కలిసి కోరారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సహాయం అందించాలని నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతానికి చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెకు చెందిన ఎన్ నరసింహస్వామి తమ 3.10 ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.

ఈ అన్ని విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Related Post

నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి