హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో విజయవంతమైన పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో నటించారు. ఈ ఇద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ ఇద్దరూ కలిసి రణబలి మూవీలో నటిస్తున్నారు. వీరిని తెరపై చూసేందుకు విజయ్, రష్మిక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా నటించిన మూవీ రణ బలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, ఫోటోలు కలకలం రేపుతున్నాయి. అంతకు ముందు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
ఫిబ్రవరి నెలాఖరులో ఉదయ్ పూర్ వేదికగా ఒక్కటి కాబోతున్నారు. అద్భుతమైన ప్యాలెస్ కూడా ఇప్పటికే బుక్ చేశారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో వైపు ప్యాలెస్ అలంకరణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 28న విజయ్, రష్మిక మందన్నాలు ఒక్కటి కాబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ 2018 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. మొత్తం మీద నేషనల్ క్రష్ రౌడీల మధ్య ప్రేమాయణం చివరకు శాశ్వత బంధానికి దారి తీయడం విశేషం.
The post అందరి కళ్లు నేషనల్ క్రష్ మందన్నా పైనే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
అందరి కళ్లు నేషనల్ క్రష్ మందన్నా పైనే
Categories: