hyderabadupdates.com movies అందులో ఆ రెండు రాష్ట్రాలను దాటేసిన ఏపీ

అందులో ఆ రెండు రాష్ట్రాలను దాటేసిన ఏపీ

దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను దాటి పారిశ్రామిక వృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.

పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటుకు సులభమైన వాతావరణమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోందని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫోర్బ్స్ ఇండియా కథనాన్ని లోకేష్ ట్యాగ్ చేశారు. దీని ప్రకారం, దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. దీంతో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది..ఈ జాబితాలో ఒడిశా 13.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 12.8 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.

ఈ మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం కేంద్రీకృతమవడం గమనార్హం. ఇది దేశంలోని పారిశ్రామిక పెట్టుబడులు తూర్పు, దక్షిణ రాష్ట్రాల వైపు మళ్లుతున్నాయన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం పెరిగి రూ. 26.6 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతున్నదనానికి నిదర్శనంగా పేర్కొంది.

Related Post

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ కెరీర్ ఆరంభంలో ఎప్పుడో పెప్సి బ్రాండును కొంత కాలం ప్ర‌మోట్ చేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత ఎప్పుడూ యాడ్స్ జోలిక

‘బాబ్రీ’ మసీదు పనులు ప్రారంభం‘బాబ్రీ’ మసీదు పనులు ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దంగా కేంద్రంగా మరోసారి బాబ్రీ అంశం రాజకీయ చర్చలకు దారితీసింది. జనతా ఉన్నాయన్‌ పార్టీ అధ్యక్షుడు హుమాయున్‌ కబీర్‌ బుధవారం ఖురాన్‌ పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ప్రకటించారు. అయోధ్యలో కూల్చివేయబడిన నిర్మాణ

Sunny Sanskari Ki Tulsi Kumari (SSKTK): When Love Quest Turns Into A Dilemma!Sunny Sanskari Ki Tulsi Kumari (SSKTK): When Love Quest Turns Into A Dilemma!

Does love sometimes lead to heartbreak? What if that heartbreak brings you to the true love of your life? The Bollywood big screens now dazzle with a romantic-comical tale of