hyderabadupdates.com movies అఖండ-2 నుంచి కొత్త బ్లాస్ట్, పేలుతుందా..?

అఖండ-2 నుంచి కొత్త బ్లాస్ట్, పేలుతుందా..?

నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు మామూలు ఊపులో లేదు. యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ సినిమాలతో పతనం చూసిన ఆయన.. మళ్లీ పుంజుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుస విజయాలందుకుని కెరీర్లో మళ్లీ పీక్స్‌ను అందుకున్నాడు నందమూరి హీరో. ఇక ‘అఖండ-2’ ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు.

‘అఖండ’కు సీక్వెల్ కావడం..  పాన్ ఇండియా ట్రెండును ఫాలో అవుతుండడంతో ఈ సినిమా వర్కవుట్ అయితే ఫలితం ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఐతే డిసెంబరు 5న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ల జోరు పెంచట్లేదని అభిమానులు కొంచెం ఫీలవుతున్నారు. కానీ టీం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది.

దసరా, దీపావళి పండుగలకు క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ రష్ ఉంది. ఈ హడావుడి అంతా అయ్యాక ‘అఖండ-2’ ప్రమోషన్లను మొదలుపెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. పండుగ టైంలో మిగతా సినిమాలతో కలిసి రావడం కన్నా.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత విడిగా తమ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న ‘అఖండ-2’ కొత్త టీజర్ రాబోతోందట. నిమిషం పైగా నిడివి ఉండే ఈ ప్రోమో ఒక బ్లాస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో బజ్ పెంచేలా ఈ ప్రోమోను దర్శకుడు బోయపాటి శ్రీను డిజైన్ చేశాడట. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కథకు భారీతనం జోడిస్తే.. దేశవ్యాప్తంగా ఆ సినిమాకు బజ్ వస్తోంది. ‘అఖండ-2’ అచ్చంగా అలాంటి సినిమానే. ఈ టీజర్ తర్వాత లెక్క వేరుగా ఉంటుందని.. ఇక్కడ్నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ వరకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటారట. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబరు 5న ‘అఖండ-2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Related Post

బండ్ల పార్టీ బడ్జెట్‌తో సినిమా తీయొచ్చుబండ్ల పార్టీ బడ్జెట్‌తో సినిమా తీయొచ్చు

కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సినిమాలు తీసినా తీయకపోయినా.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంటాడు. ఒక దశలో వరుసబెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీసిన బండ్ల.. 2015లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ప్రొడక్షన్లోకి రావాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.