hyderabadupdates.com movies అది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ

అది సాధిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ

అక్షరాలా వంద కోట్లు.. అంటే వెయ్యి మిలియన్లు.. ఈ మొత్తాన్ని ఒకరికి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తాం అని ఆయన అన్నారు.

క్వాంటమ్‌ టాక్ బై సీఎం సీబీఎన్ కార్యక్రమం ఈ రోజు జరిగింది. వర్చువల్ గా ఈ కార్యక్రమానికి వైసర్, క్యూబిట్ సంస్థల ప్రతినిధులు, ఐఐటీ చెన్నై, తిరుపతి డైరెక్టర్లు. వేల మంది టెక్ విద్యార్ధులు హాజరయ్యారు. ఇందులో సీఎం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

నోబెల్ బహుమతికి నగదు బహుమతి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ఇస్తారు. అంటే సుమారు 1.17 మిలియన్ అమెరికన్ డాలర్లు లేదా రూ. 10.36 కోట్లు ఉంటుంది, ఇది ప్రతి సంవత్సరం మారుతుంది, అటువంటిది ఒక రాష్ట్ర సీఎం ఏకంగా 100 కోట్లు ప్రకటించడం విశేషం.

ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్ అని సీఎం అన్నారు. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారధ్యం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం అన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుందన్నారు. క్వాంటం రంగంలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం అని సీఎం తెలిపారు.

Related Post

అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)…బీజేపీ హ్యాట్రిక్ విజయాల వెనుక ఉన్న శక్తి. చాలామంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ నడుస్తుందని, చాలా టికెట్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రికమండేషన్ పై

3 Tamil and Telugu OTT Releases to Watch This Week: Roshan Kanakala’s romantic actioner Mowgli to Kumki 23 Tamil and Telugu OTT Releases to Watch This Week: Roshan Kanakala’s romantic actioner Mowgli to Kumki 2

Cast: Mathi, Arjun Das, Shrita Rao, Hareesh Peradi, Suzane George, Srinath, Nadackal Unnikrishnan, Athu Ithu Ethu Andrews, Florent Pereira Director: Prabhu Solomon Language: Tamil Genre: Children’s Musical Adventure Drama Runtime:

కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!

సాధార‌ణంగా జ‌నావాసాలు ఉండే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌డం తెలిసిందే. ఆయా కేంద్రాల‌కు ఎన్నిక‌ల సిబ్బంది చేరుకోవ‌డం.. పోలింగ్ యంత్రాల‌ను త‌ర‌లించ‌డం కూడా పెద్ద క‌ష్టం కాదు. ఇక‌, భ‌ద్ర‌తా ప‌రంగా కూడా భారీ సంఖ్య‌లోనే పోలీసుల‌ను