hyderabadupdates.com movies అన్నగారికి అసలు టెన్షనే లేదు

అన్నగారికి అసలు టెన్షనే లేదు

అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే అయినా నిర్మాతల నుంచి అధికారిక కన్ఫర్మేషన్ లేకపోవడంతో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఇతర మీడియం బడ్జెట్ సినిమాలు ప్రమోషన్లు ఆపేసి కూచున్నాయి. ఒకవేళ బాలయ్య వస్తే థియేటర్లు, ఓపెనింగ్స్ పరంగా ఇబ్బందవుతుంది కాబట్టి ఎందుకొచ్చిన తలనెప్పిలెమ్మని సైలెంట్ గా ఉన్నారు. సరే అఖండ ఎల్లుండి విడుదల ఫిక్స్ అయిపోదాం కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి టెన్షన్ లేకుండా వస్తోంది అన్నగారు వస్తారు మాత్రమే. శుభ్రంగా శుక్రవారం థియేటర్లకు వచ్చేస్తోంది.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసేశారు. నిజానికి అన్నగారు వస్తారుకి అఖండ 2 వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని ప్రధాన టార్గెట్ తమిళ మార్కెట్. ఇక్కడ ఎంత వచ్చినా బోనస్ అవుతుంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఎలాగూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి ఆ ధీమాతోనే పోటీ గట్రా లెక్కలు వేసుకోలేదు. లేదంటే ఇంకో వారం ఆగి తెలుగు వెర్షన్ విడుదల చేసేవాళ్ళు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన అన్నగారు వస్తారు కమర్షియల్, ఎక్స్ పరిమెంట్ ఇలా రెండు అంశాలను మేళవించుకుని ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెబుతున్నారు.

కార్తీకి ఇది హిట్ కావడం చాలా అవసరం. గత కొన్నేళ్లుగా సోలో హీరోగా చెప్పుకోదగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. పొన్నియన్ సెల్వన్ తమిళంలో హిట్ అయ్యింది కానీ అది మల్టీస్టారర్ కావడం వల్ల తన భాగం పరిమితం అయ్యింది. అన్నగారు వస్తారు కూడా బాగా లేట్ అవుతూ వచ్చిన ప్రాజెక్టు. నిర్మాణంలో ఆలస్యంతో పాటు కంగువ ఎఫెక్ట్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ మరింత జాప్యానికి గురయ్యింది. ఎట్టకేలకు మోక్షం  దక్కింది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సైతం దీని మీద చాలా నమ్మకం పెట్టుకుంది. తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒత్తిడిలో ఉంటే అన్నగారు వస్తారు మాత్రం ఇంత కూల్ గా ఉండటం వెరైటీ.

Related Post

Sharwa’s Nari Nari Naduma Murari Teaser Promises Wholesome LaughsSharwa’s Nari Nari Naduma Murari Teaser Promises Wholesome Laughs

The teaser of Nari Nari Naduma Murari, headlined by Charming Star Sharwa and directed by Ram Abbaraju, has been unveiled, setting expectations high for a colorful, clean, and laughter-filled family