hyderabadupdates.com movies అప్పుడే వంద కోట్లు తెచ్చిపెట్టిన లారెన్స్

అప్పుడే వంద కోట్లు తెచ్చిపెట్టిన లారెన్స్

రాఘవ లారెన్స్‌‌.. అంటే మొదట్లో ఓ మంచి కొరియోగ్రాఫర్ మాత్రమే. ఆ రంగంలో అత్యున్నత స్థాయిని అందుకుంటున్న సమయంలోనే అతను నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఇదేమంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ కొన్నేళ్లకు దర్శకుడి అవతారం ఎత్తి అందరికీ పెద్ద షాకిచ్చాడు. అక్కినేని నాగార్జున లాంటి మంచి జడ్జిమెంట్ ఉన్న స్టార్ హీరో సొంత బేనర్లో తనతో సినిమా చేశాడు. ‘మాస్’ పెద్ద హిట్టయి ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. 

ఆ తర్వాత ‘కాంచన’ హార్రర్ కామెడీ సిరీస్‌తో లారెన్స్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఐతే ‘కాంఛన-3’ తీశాక చాలా గ్యాప్ తీసుకున్న లారెన్స్.. ఎట్టకేలకు కొన్ని నెలల కిందటే ‘కాంఛన-4’ మొదలుపెట్టాడు. ఐతే దర్శకుడిగా లారెన్స్‌కు చాలా గ్యాప్ రావడం, మధ్యలో హార్రర్ కామెడీలు ఔట్ డేటెడ్ అయిపోవడంతో ఈ చిత్రానికి ఏమాత్రం హైప్ వస్తుందో అనుకున్నారు. కానీ హార్రర్ కామెడీల్లో లారెన్స్ బ్రాండ్ వాల్యూనే వేరని రుజువైంది.

చిత్రీకరణ ఇంకా పూర్తి కాకముందే ‘కాంచన-4’కు ఒక రేంజిలో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. అన్ని భాషలకూ కలిపి ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ.50 కోట్లు పలికాయట. ఇంతకుమించి విశేషం ఏంటంటే ఈ మూవీ హిందీ హక్కులు రూ.50 కోట్లకు పైగానే తెచ్చిపెట్టాయట. కాంచన సిరీస్‌లో ప్రతి సినిమానూ హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్ కుమార్ చేసిన ‘కాంచన’ రీమేక్ కంటే లారెన్స్ వెర్షన్స్‌నే ఎక్కువ చూశారు.

కాబట్టి బేసిగ్గానే ‘కాంచన-4’కు హిందీలో మంచి డిమాండే ఉంది. పైగా ఇందులో పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లు సినిమాకు తెచ్చిపెట్టే ఆకర్షణే వేరు. సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసే గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావడం విశేషం. కాబట్టే హిందీలో మంచి డిమాండ్ ఏర్పడింది. షూటింగ్ మధ్యలోనే ఇలా వంద కోట్ల ఆదాయం తెచ్చిపెట్టడం అంటే లారెన్స్ సామాన్యుడు కాడనే చెప్పాలి.

Related Post

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి పందేలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఒక‌ప్పుడు గోదావ‌రి జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కోడి పందేలు.. పొట్టేలు పందేలు.. త‌ర్వాత త‌ర్వాత‌.. కొన్ని

Constable Kanakam 2: Rajeev Kanakala and Srinivas Avasarala to steal the showConstable Kanakam 2: Rajeev Kanakala and Srinivas Avasarala to steal the show

Constable Kanakam Season 2 is all set to premiere on January 8, raising expectations among one and all. Varsha Bollamma returns as the lead, continuing her impressive journey in the