hyderabadupdates.com movies అబ్బాయ్ హిట్టిచ్చాడు… బాబాయ్ బ్లాక్ బస్టరివ్వాలి

అబ్బాయ్ హిట్టిచ్చాడు… బాబాయ్ బ్లాక్ బస్టరివ్వాలి

ఒకే కుటుంబం నుంచి రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలతో జోడిగా నటించే ఛాన్స్ అందరికీ రాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి ఏఎన్ఆర్ తో ప్రేమాభిషేకం లాంటి బ్లాక్ బస్టర్లు, నాగార్జునతో ఆఖరి పోరాటం లాంటి సూపర్ హిట్లు అందుకోవడం గురించి ఫ్యాన్స్ స్పెషల్ గా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పటి జనరేషన్ లో కాజల్ అగర్వాల్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150, రామ్ చరణ్ తో నాయక్ – మగధీర లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించి ఈ ఘనత అందుకుంది. ఇంకా ఉదాహరణలు ఉన్నాయి కాని తాజాగా ఈ లిస్టులో సంయుక్త మీనన్ చేరబోతోంది. తను నటించిన అఖండ 2 తాండవం ఎల్లుండి రిలీజ్ కానుంది.

రెండేళ్ల క్రితం 2023 ఇదే డిసెంబర్ నెలలో సంయుక్త మీనన్ నటించిన డెవిల్ రిలీజయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామా అంచనాలు అందుకోలేదు. అంతకు ముందే ఇదే కాంబోతో 2022లో బింబిసార ఘనవిజయం సాధించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలకృష్ణతో అఖండ 2లో జంట కట్టింది. సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్ జాజికాయ జాజికాయ ఈ ఇద్దరి కాంబోలో షూట్ చేశారు. బాలయ్యతో కలిసి నటించిన అనుభవాల గురించి ఎగ్జైట్ అవుతున్న సంయుక్త మీనన్ తాను చేసింది రెగ్యులర్ పాత్రలా ఉండదని చెబుతోంది. అఖండ 1లో నటించిన ప్రగ్య జైస్వాల్ స్థానంలో తనొచ్చిన సంగతి తెలిసిందే.

ఇక దీన్ని కాసేపు పక్కనపెడితే రాబోయే ఏడాది కాలంలో సంయుక్త మీనన్ నటించిన మరో అరడజను సినిమాలు విడుదలకు రెడీ కాబోతున్నాయి. నిఖిల్ సిద్దార్థ్ స్వయంభు, బాలీవుడ్ మూవీ మహారాగ్ని, మోహాన్ లాల్ రామ్, లారెన్స్ బెంజ్, విజయ్ సేతుపతి – పూరి జగన్నాధ్ స్లమ్ డాగ్ ఉన్నాయి. వీటికన్నా ముందు వచ్చే సంక్రాంతికి శర్వానంద్ నారి నారి నడుమ మురారి రిలీజ్ కానుంది. పైకి కనిపించదు కానీ రష్మిక మందన్న, శ్రీలీల రేంజ్ లో కౌంట్ అయితే ఉంది కానీ సంయుక్త మీనన్ కు పెద్ద బ్రేక్ దక్కాల్సి ఉంది. అది అఖండ 2 ఏ మేరకు తీరుస్తుందో రేపు అర్ధరాత్రికి తెలిసిపోతుంది.

Related Post

Hotel Costiera Serves Up a Cozy, Slightly Watered Down Heist CocktailHotel Costiera Serves Up a Cozy, Slightly Watered Down Heist Cocktail

Cozy mysteries are as addictive as cocktails because they require a specially crafted mix. The combination of sleuthing, everyday situations flipped into comedy, and the tease of ‘will they, won’t

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం