hyderabadupdates.com movies అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన దురంధర్ 2

అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన దురంధర్ 2

ఇవాళ అనౌన్స్ చేసిన దురంధర్ 2 టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు పన్నెండు దాటుతుందా అని వెయిట్ చేస్తే చివరికి నిరాశే మిగిలింది. ఎందుకంటే కొత్త విజువల్స్ రివీల్ చేయకుండా, దురంధర్ ఎండ్ క్రెడిట్స్ లో చూపించిన కంటెంట్ నే తిరిగి ఇప్పుడు కొత్త టీజర్ పేరుతో కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మార్చి చూపించారు కాబట్టి.

దీంతో ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటయ్యా అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. కేవలం నిమిషంన్నరలోపే ఉన్నప్పటికీ ఈ వెర్షన్ అందరూ ఎప్పుడో చూసేశారు. బాలన్స్ ఉన్న వాళ్ళు నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో వచ్చాక రిపీట్ షోస్ వేసుకుని మరీ ఎంజాయ్ చేశారు.

అలాంటప్పుడు దీన్ని టీజర్ పేరుతో ఎందుకు హడావిడి చేశారనే డౌట్ రావడం సహజం. నిజానికి దురంధర్ 2 కంటెంట్ ఇంకా సిద్ధంగా లేదని ముంబై రిపోర్ట్. ప్యాచ్ వర్క్ ఒకపక్క జరుగుతుండగా, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనుల్లో దర్శకుడు ఆదిత్య దార్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా టీమ్ పరుగులు పెడుతోంది.

కొత్త వర్షన్ కట్ చేసేంత టైం అక్కడ లేదు. కేవలం మార్చి 19 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పడానికే ఈ వీడియో వదిలారు తప్పించి వేరే కారణం ఉండకపోవచ్చని బాలీవుడ్ మీడియా అంటోంది. ఏమైనా టీజర్ చూసిన మూవీ లవర్స్ మాత్రం కొత్తగా ఏం లేకపోవడంతో నిరాశ చెందారు.

మార్చి 19 ఎంతో దూరంలో లేదు. దురంధర్ 2 కౌంట్ డౌన్ బాలీవుడ్ వర్గాల్లో మొదలైపోయింది. అదే రోజు ప్లాన్ చేసుకున్న అడవి శేష్ డెకాయిట్ ఆల్రెడీ వాయిదా నిర్ణయం తీసుకుందని ఇన్ సైడ్ టాక్. యష్ టాక్సిక్ వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. థియేటర్ అగ్రిమెంట్లు మొదలైపోయాయి కాబట్టి పోస్ట్ పోన్ ఉండకపోవచ్చని బెంగళూరు న్యూస్.

ఒకవేళ అదే జరిగితే కర్ణాటక మినహాయించి టాక్సిక్ కు దురంధర్ 2 రూపంలో పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. దాన్ని ఎలా ఎదురుకుంటారనేది చూడాలి. మొదటి భాగంలాగే దురంధర్ 2 మూడున్నర గంటలు ఉంటుందని టాక్. మంచిదే. చూసేందుకు జనం రెడీగా ఉన్నారు.

Related Post

Telugu Viral Girl to Romance Dhanush’s Nephew Pavish in His Second FilmTelugu Viral Girl to Romance Dhanush’s Nephew Pavish in His Second Film

Dhanush’s nephew Pavish Narayan was introduced as the lead actor in Nilavukku Enmel Ennadi Kobam (NEEK), which was dubbed in Telugu as Jabilamma Neeku Antha Kopama. Dhanush directed the movie,