hyderabadupdates.com movies ‘అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు’

‘అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు’

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలకు ముందు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అమరావతికి మద్దతిచ్చిందని తెలిపారు. అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని చెప్పారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా బిల్లులో అంశాలుండాలని డిమాండ్ చేశారు.

రైతులకు న్యాయం జరగలేదని, రామారావు అనే రైతు ఆవేదన చెందుతూ చనిపోయారని, వారి తరఫున పార్లమెంటులో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా అన్ని అంశాలు లేేవనెత్తాలని వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా వైసీపీ ఎంపీలు పోరాడతారని తెలిపారు.

7 నెలలుగా జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం నిధులు పెండిగ్ లో ఉన్నాయని గత పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ లేవనెత్తిందని, ఆ తర్వాతే నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.

Related Post

బన్నీ ప్లానింగ్… మైండ్ బ్లోయింగ్బన్నీ ప్లానింగ్… మైండ్ బ్లోయింగ్

టాలీవుడ్ స్టార్ హీరోల్లో కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్, సినిమాలు చేయడంలో తిరుగులేని ప్లానింగ్ ఉన్న స్టార్ హీరోగా అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపు ఉంది. అతను ఏ కథనూ ఆషామాషీగా ఒప్పుకోడు. ఒక సినిమా తన కెరీర్‌కు ఏ విధంగా

చిరు లేడు కానీ… చిరు వచ్చాడుచిరు లేడు కానీ… చిరు వచ్చాడు

గత మూడు దశాబ్దాల్లో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడ్డ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఎంతోమంది దర్శకులకు సినిమా పిచ్చి ఎక్కించడంలో చిరు ప్రధాన పాత్ర