hyderabadupdates.com Gallery అమ‌రావ‌తిపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేదు

అమ‌రావ‌తిపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేదు

అమ‌రావ‌తిపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేదు post thumbnail image

అమ‌రావ‌తి : అమ‌రావ‌తిపై మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచనను రాష్ట్ర ప్రజలే ఛీత్క‌రించార‌ని, చివ‌ర‌కు 11 సీట్ల‌కు ప‌రిమితం చేశార‌ని, అయినా త‌న‌కు బుద్ది రావ‌డం లేద‌న్నారు కొలువు పార్థ‌సార‌థి. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుభవించిన చీకటి రోజులను, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చారిత్రక తప్పిదాలను ఎండగట్టారు.
గ్రామాల్లో ఒక సంప్రదాయం ఉంటుంది.. శుభకార్యాల సమయంలో అమంగళకరమైన పేర్లు పలకకూడదని భావిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ‘జగన్’ అనే పేరు కూడా అలాంటిదే అని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక గొప్ప సంబరం లాంటిదని, కానీ జగన్ ఆ సంతోష సమయంలో ‘కంటిలో నలుసులా’, ‘రాష్ట్రానికి పట్టిన చీడపీడలా’ తయారయ్యారని మండిపడ్డారు. రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు తెలుపుతుంటే, వైసీపీ మాత్రం పార్లమెంటులో వాకౌట్ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టిందని విమర్శించారు.
అబద్ధాల పునాదుల మీద ‘వికేంద్రీకరణ’ డ్రామా ఆడార‌ని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించి, అధికారంలోకి వచ్చాక సూట్‌కేసు రాజకీయాలు చేస్తూ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు. తన తప్పులను ఒప్పుకునే అలవాటు జగన్‌కు లేదని, ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా తన ఆలోచనలనే కార్యకర్తలపై రుద్దే నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు. రాజధాని పేరును ‘మావిగన్’ గా మార్చాలని చూడటం ఆయన ‘తుగ్లక్’ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
The post అమ‌రావ‌తిపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియోRed Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో

    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మురం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ వీడియో బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు

Actor Srikanth Iyengar Issues Apology for Controversial Gandhi RemarksActor Srikanth Iyengar Issues Apology for Controversial Gandhi Remarks

Telugu actor Srikanth Iyengar, who recently made controversial remarks about Mahatma Gandhi, has issued a public apology. Posting a video on social media, he expressed regret for his earlier statements,