hyderabadupdates.com Gallery అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై. గురువారం ఎన్డీయే నేత‌ల‌తో అమ‌రావ‌తి బిల్లు ఆమోదం పొందిన సంద‌ర్భంగా టెలికాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందన్నారు. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు కేంద్ర సహకారంతో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతోందని చెప్పారు. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశ పెట్ట‌డం ఆనందంగా ఉంద‌న్నారు. అమరావతి మనకు ఒక సెంటిమెంట్ అని పేర్కొన్నారు. కానీ గ‌తంలో పాలించిన జ‌గ‌న్ రెడ్డి ఏపీకి కావాల‌ని 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశార‌ని ఆరోపించారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారని, అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని ధ్వ‌జ‌మెత్తారు చంద్రబాబు నాయుడు.
అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరన్నారు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని పేరు ఉంటే ఎస్ఆర్ఎంగా అంటూ మార్పించిన ఘ‌న‌త త‌న‌దేన‌ని పేర్కొన్నారు. అమరావతి పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్‌లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంద‌న్నారు. మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలన్నారు. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఇక ప‌ల్లె ప‌ల్లెలో సంబురాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు ముఖ్య‌మంత్రి.
The post అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలినెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి

న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారాడు దేశ వ్యాప్తంగా. త‌ను కీల‌క‌మైన అంశాల గురించి ఏకి పారేశాడు పార్ల‌మెంట్ సాక్షిగా. ఆయ‌న సంధించిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తున్నాయి. త‌ను వేసిన ప్ర‌శ్న‌ల‌కు

పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలిపార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి

గుంటూరు జిల్లా : ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అంటేనే కార్య‌క‌ర్త‌లు అని, వారు లేక పోతే పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డం అత్యంత క‌ష్ట‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌గ‌న్ రెడ్డి

పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో టీవీకే ఒంట‌రిగానే బ‌రిలోకిపుదుచ్చేరి ఎన్నిక‌ల్లో టీవీకే ఒంట‌రిగానే బ‌రిలోకి

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక‌ల హ‌డావుడి పీక్ స్టేజ్ కు చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ప్ర‌ధానంగా ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీపై అంద‌రి