hyderabadupdates.com movies అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ మూవీ వెనుక తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. దీనికి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వం వహించారు. గతంలో విశ్వక్ సేన్ మీద ఆరోపణలు చేసి, తనను తప్పించి వేరే హీరోని తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టులోనే.

ఇప్పుడు దీన్ని హిట్ చేసి చూపించడం ద్వారా తన నిర్ణయం రైటని రుజువు చేయాలి. కాకతాళీయంగా సీత పయనం రిలీజ్ కు ముందు రోజు విశ్వక్ సేన్ ఫంకీ రానుంది. ఒకరకంగా చెప్పాలంటే విభేదాలు తెచ్చుకున్న ఒక సీనియర్ జూనియర్ మధ్య డైరెక్ట్ క్లాష్ అన్నమాట.

ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలిపోతుంది కానీ అర్జున్ అదృష్టవంతుడిని చెప్పాలి. ఎందుకంటే స్వంత కూతుళ్లను డైరెక్ట్ చేసే అవకాశం అందరు స్టార్లకు రాదు. శృతి హాసన్ అంత టాప్ పొజిషన్ కు వెళ్లినా కమల్ హాసన్ డైరెక్షన్ లో ఇప్పటిదాకా చేయలేదు. స్వర్గీయ కృష్ణ తన కొడుకుల కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు కానీ కూతురు ఇందిర యాక్టర్ అయ్యాక ఆ ఛాన్స్ దొరకలేదు.

రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ కేవలం నటనకే పరిమితం కావడం వల్ల బిడ్డలకు క్లాప్స్ కొట్టే భాగ్యం దక్కలేదు. కానీ అర్జున్ అలా కాదు. సీత పయనం ద్వారా ఆ ముచ్చటను తీర్చుకుంటున్నారు.

ఇక బజ్ విషయానికి వస్తే సీత పయనం మీద ఒకింత అంచనాలు ఉన్నాయి కానీ ప్రమోషన్ల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ జంటగా నటించిన ఈ మూవీలో మార్టిన్ ఫేమ్ ధృవ సర్జ స్పెషల్ క్యామియో చేశాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు.

టెక్నీషియన్స్ విషయంలో అర్జున్ రాజీ పడలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న సీత పయనం ఏ మేరకు మెప్పిస్తుందో ఫిబ్రవరి 14 తేలనుంది. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న అర్జున్ ఇది కనక సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు డైరెక్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

Related Post

What Happened to Prasanth Varma’s Jai Hanuman? Fans Still Waiting for a Take-OffWhat Happened to Prasanth Varma’s Jai Hanuman? Fans Still Waiting for a Take-Off

After the massive Sankranthi 2024 blockbuster success of Hanuman, expectations skyrocketed when its sequel Jai Hanuman was officially announced as a Sankranthi 2025 release. Directed by Prasanth Varma, the film

Thaman’s Cryptic #NewGuyInTown Tweet Ignites Curiosity in TollywoodThaman’s Cryptic #NewGuyInTown Tweet Ignites Curiosity in Tollywood

Tollywood circles are buzzing after star music director S Thaman dropped a mysterious tease on social media. His tweet, carrying the hashtag #NewGuyInTown, has triggered widespread speculation about a new