hyderabadupdates.com movies అర్జున్ కష్టానికి ఫలితం జీరో

అర్జున్ కష్టానికి ఫలితం జీరో

సీనియర్ నటుడు అర్జున్ కు యాక్షన్ హీరో అని పేరు. కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేశాడు అర్జున్. 90వ దశకంలో జెంటిల్‌మ్యాన్, ఒకే ఒక్కడు చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన. దీంతో పాటు స్వీయ దర్శకత్వంలో నటించిన ‘జైహింద్’ సైతం భారీ విజయాన్నందుకుంది. ఆపై దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. ఐతే అర్జున్ యాక్షన్ సినిమాలు తీస్తే ఓపెనింగ్స్ బాగానే వచ్చేవి. హీరోగా మార్కెట్ దెబ్బ తిన్నాక ఆయన దర్శకుడిగా సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. 

చాలా ఏళ్ల పాటు మెగా ఫోన్ పట్టకుండా ఉండిపోయిన ఆయన.. కొన్నేళ్ల ముందు ఒక ఫీల్ గుడ్ సినిమా తీద్దామని కథ సిద్ధం చేసుకున్నారు. విశ్వక్సేన్‌ను అందులో కీలక పాత్ర కోసం ఎంచుకున్నాడు. కానీ అతను చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు డోలాయమానంలో పడింది. కానీ అర్జున్ పట్టు వదలకుండా తన కూతురు ఐశ్వర్యకు జోడీగా నిరంజన్ అనే కొత్త కుర్రాడిని పెట్టుకుని సినిమాను పట్టాలెక్కించాడు. అదే.. సీతాపయనం.

అర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. స్టార్ కాస్ట్ లేకపోయినా, తన మార్కెట్ కూడా బాగా దెబ్బ తిన్నా.. ధైర్యంగా, కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమా తీశాడు అర్జున్. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను గత వారం ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

కానీ గట్టిగా ప్రమోట్ చేసినా.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయాడు అర్జున్. పైగా సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. సొసైటీకి ఏదో మంచి చెప్పాలన్న తపన బాగుంది కానీ.. ఆసక్తికర కథాకథనాలుంటేనే ఏ మంచినైనా ప్రేక్షకులకు చేరుతుంది. అవి మిస్ కావడంతో సినిమా ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టించేసింది. 

ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ లేవు. పైగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో వీకెండ్లోనే సినిమా వాషౌట్ అయిపోయింది. తెలుగులో అయినా పబ్లిసిటీ, రిలీజ్ ఖర్చులు కూడా రికవర్ కావడం కూడా కష్టమే అనిపిస్తోంది. ఇతర భాషల్లో కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు లేదు. మొత్తంగా ఈ సినిమా మీద అర్జున్ పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టమంతా వృథా అయ్యేట్లే కనిపిస్తోంది.

Related Post

Is Tobey Maguire Returning in Spider-Man 4? Writer Hints at Peter Parker’s ComebackIs Tobey Maguire Returning in Spider-Man 4? Writer Hints at Peter Parker’s Comeback

So far, there is no official confirmation from Tobey Maguire or the studios. However, the comments have kept fan speculation alive about a possible continuation of Raimi’s beloved trilogy or