hyderabadupdates.com movies అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్ అని బిల్డప్ ఇవ్వడం, హడావిడి చెయ్యడం పవన్ దగ్గర కనిపించవు. కలెక్షన్లు, రికార్డుల పిచ్చి ఉండదు. తన సినిమాలను పెద్దగా ప్రమోట్ కూడా చెయ్యడు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రమోషన్ మరీ తగ్గిపోయింది. తన సినిమాల ఈవెంట్లకు వచ్చినా చాలా తక్కువ మాట్లాడతాడు. ఫాన్స్ కోరుకున్నట్లుగా గూస్ బంప్స్ మూమెంట్స్ ఏమి ఉండవు పవన్ ఈవెంట్లలో.

ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా కావడంతో ఇంకా కామ్ అయిపోయాడు పవన్. నిన్నటి ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లోనూ అంతే. చాలా సింపుల్ గా ఉన్నది. ప్రసంగం కూడా అలాగే సాగింది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో.

ఐతే గత ఏడాది ఓజీ సినిమా ఈవెంట్లో మాత్రం పవన్ చాలా భిన్నంగా కనిపించాడు. బహుశా తన కెరీర్ మొత్తంలో పవన్ ఎక్కువ హంగామా చేసింది అంటే ఆ ఈవెంట్లోనే అని చెప్పొచ్చు. ఆ వేడుకలో పవన్ ఓజీ సినిమాలో వాడిన కత్తి పట్టుకుని వేదిక మీదికి రావడం విశేషం. ఆ కత్తితో కలియ తిరుగుతూ.. పోజులు ఇస్తూ. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాడు పవర్ స్టార్.

వేదిక మీద జనాలను కంట్రోల్ చెయ్యడం, సినిమాల్లో మాత్రమే కనిపించే ఒక రకమైన యాటిట్యూడ్ చూపించడం.. ఇలా చాలా హంగామానే నడిచింది ఆ ఈవెంట్లో. వర్షం వల్ల ఆ ఈవెంట్ కొంచెం దెబ్బతింది కానీ లేదంటే పవన్ కెరీర్ మొత్తంలో చాలా స్పెషల్ గా చెప్పుకోదగ్గ కార్యక్రమం అది. పవన్ అలా చెయ్యడానికి ఓజీ పాత్ర అంత ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. ఈ విషయంలో పవన్ ను దర్శకుడు సుజీత్ ఎలా ఒప్పించాడో అని ఇప్పటికీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి ఈవెంట్ తర్వాత ఆ వీడియోలు తీసుకొచ్చి పోస్ట్ చేస్తున్నారు.

Related Post

భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’

భారత రక్షణ రంగానికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన సైనిక శక్తిని అమాంతం పెంచేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది.

చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి వాడారు: జగన్చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి వాడారు: జగన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఉందని వైసీపీ వాదిస్తోంది. అయితే, ఆ వాదనలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ

ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!

“భార‌త దేశం స‌ర్వ‌స‌త్తాక సార్వ‌భౌమ దేశం. ఇత‌ర దేశాల‌కు త‌ల‌వొంచ‌దు. ఎవ‌రో చెప్పిన‌ట్టు కూడా న‌డుచుకోదు. ఎవ‌రి ఆదేశాల‌నో పాటించాల్సిన అవ‌స‌రం కూడా లేదు.” రాజ్యాంగ పీఠిక‌ను త‌ర్జుమా చేస్తే వినిపించే మాట ఇదే. మ‌రి ఇప్పుడు ఏం జ‌రిగింది? ఏం