hyderabadupdates.com movies అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా ఇప్పటి సందర్భాలకు కూడా ఇది సరిగ్గా వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 17 అలియా భట్ నటించిన బాలీవుడ్ మొదటి లేడీ స్పై థ్రిల్లర్ అల్ఫా విడుదలకు రెడీ అవుతోంది. నిజానికి డిసెంబర్ 25 రావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడీ మూవీకి అడ్వాన్స్ ట్రోలింగ్ మొదలయ్యేలా ఉంది. కారణం దురంధర్. రెండింటికి దర్శక నిర్మాతల పరంగా ఎలాంటి కనెక్షన్ లేదు కానీ నెటిజెన్లు మాత్రం అల్ఫాని టార్గెట్ చేసేలా ఉన్నారు

ఎందుకో చూద్దాం. దురంధర్ ని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వంగా నెగటివ్ ప్రచారం చేయడం తెలిసిందే. కానీ వాళ్ళ పబ్లిసిటీ రివర్స్ కొట్టేసి సినిమా బ్లాక్ బస్టర్ దాటి ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. యష్ రాజ్ ఫిలింస్ తీసిన పఠాన్, వార్, ఏక్ ధా టైగర్ లాంటి వాటిని మాస్టర్ పీసెస్ గా పొగిడిన వాళ్ళు ఇప్పుడు దురంధర్ లో పాకిస్థాన్ మాఫియాని నగ్నంగా చూపించేసరికి తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి నిత్యం ఎక్స్, టీవీ ఛానల్స్ లో డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీ అల్ఫా నిర్మించింది యష్ రాజ్ ఫిలింసే. ఇది కూడా పాకిస్థాన్, ఇండియా గూఢచారుల నేపథ్యంలో సాగుతుంది.

ఉత్తరాది వర్గాల ప్రకారం అల్ఫాలో పాక్, భారత స్పైలు స్నేహం చేసినట్టుగా చూపించబోతున్నారట. ఇది నిజమో కాదో కానీ ఒకవేళ ఉంటే మాత్రం సోషల్ మీడియాలో తలంటు తప్పదు. బాబీ డియోల్ విలన్ గా నటించిన అల్ఫాలో మరో గూఢచారి క్యారెక్టర్ శర్వారి వాఘ్ చేస్తోంది. మెయిన్ విలన్ బాబీ డియోల్. వార్ 2 చివర్లో చూపించింది ఈ సినిమా తాలూకు క్లిప్పే. జూనియర్ ఎన్టీఆర్ తో సహా యష్ స్పై యూనివర్స్ లో హీరోలను ఇందులో చూపించాలనుకున్నారు కానీ తర్వాత వద్దనుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే దురంధర్ కనక మార్చి 19 వస్తే కేవలం నెల రోజుల గ్యాప్ లో రిలీజయ్యే అల్ఫాకు మరిన్ని చిక్కులు తప్పవు.

Related Post

9 South Films Releasing This Week in Theaters: Mammootty starrer Kalamkaval to Nandamuri Balakrishna’s Akhanda 29 South Films Releasing This Week in Theaters: Mammootty starrer Kalamkaval to Nandamuri Balakrishna’s Akhanda 2

Cast: Nandamuri Balakrishna, Samyuktha, Aadhi Pinisetty, Harshaali Malhotra, Kabir Duhan Singh, Saswata Chatterjee, Ronson Vincent, Achyuth Kumar, Sangay Tsheltrim Director: Boyapati Sreenu Language: Telugu Genre: Fantasy Action Drama Runtime: 2

Billy Magnussen & Alexandra Shipp in ‘Violent Ends’ Revenge Trailer
Billy Magnussen & Alexandra Shipp in ‘Violent Ends’ Revenge Trailer

“Bad blood runs deep.” IFC has revealed the official trailer for a revenge thriller film titled Violent Ends, an indie creation written and directed by John-Michael Powell as his second