hyderabadupdates.com movies అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?

అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన అరవ శ్రీధర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అరవ శ్రీధర్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ మహిళను ఏడాదిన్నరగా బెదిరిస్తున్న శ్రీధర్ ఆమెను బలవంతంగా లోబర్చుకున్నాడనని, ఆమె గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడని ఓ మీడియా ఛానెల్ లో కథనం వచ్చింది. అంతేకాదు, ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా అరవ శ్రీధర్ బెదిరించారని ఆ కథనంలో ఆరోపించారు.

సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయగా…అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆమె భర్తకు ఫోన్ చేసి అరవ శ్రీధర్ బెదిరించారని, ఆ క్రమంలో ఆ మహిళకు తన భర్తతో విభేదాలు వచ్చాయట.

భర్తకు విడాకులివ్వకుంటే మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని శ్రీధర్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా ఆ టార్చర్ భరించిన సదరు మహిళ ఇక తట్టుకోలేక శ్రీధర్ తో వాట్సాప్ వీడియో కాల్స్, వాట్సాప్ చాట్ హిస్టరీ బయటపెట్టారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్, జనసేన నేతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Related Post

వైభవ్ ఇండియా టీమ్ లోకి వస్తే ఎవరికి ఎఫెక్ట్?వైభవ్ ఇండియా టీమ్ లోకి వస్తే ఎవరికి ఎఫెక్ట్?

14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా, టీమ్ ఇండియాకు ఒక పవర్‌ఫుల్ వెపన్‌లా మారిపోయాడు. వైభవ్ వస్తున్నాడంటే అది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే కాదు,