hyderabadupdates.com movies అసమర్థుడు: రాహుల్ పై దండయాత్ర

అసమర్థుడు: రాహుల్ పై దండయాత్ర

జాతీయ స్థాయిలో వచ్చిన విశ్లేషణలు నిజమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మేధావుల దండయాత్ర ప్రారంభమవుతుంది అని రెండు రోజుల క్రితం ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు తాజాగా నిజమయ్యాయి. ఏకంగా 272 మంది మేధావులు రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో సంతకాలు కూడా చేశారు. మరో లేఖపైనా వారు సంతకాలు చేయడం గమనార్హం.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని కూడా ప్రకటించి మహారాష్ట్ర కర్ణాటకల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎన్నికల సంఘం ప్రక్రియలో ఉన్న లోపాలను ఎండగట్టారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇస్తూనే ఆయన చేసిన విమర్శలను కొట్టి పారేశారు. ఒకే డోర్ నెంబర్ తో ఇన్ని వేల ఓట్లు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు వారంతా ఇళ్లు లేని వారని అందుకే ఉజ్జాయింపుగా ఇచ్చిన నెంబరని వ్యాఖ్యానించారు.

బీహార్ ఎన్నికలకు నెల రోజుల ముందు ఏడు జిల్లాలను కవర్ చేస్తూ రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేపట్టారు. అక్కడ కూడా 65000 ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. అయితే ఇవన్నీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాలికి కొట్టుకుపోయాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం దక్కించుకుంది. అయినా ఓట్ చోరీపై తమ యుద్ధం ఆగదని కాంగ్రెస్ పార్టీ సహా రాహుల్ గాంధీ చెబుతున్నారు. దీనిపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తున్నారు. ప్రస్తుతం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కొనసాగుతోంది.

ఈ నేపధ్యంలో తాజాగా రాహుల్ గాంధీని దేశవ్యాప్తంగా 272 మంది మేధావులు దుయ్యబట్టారు. ఎన్నికల్లో విజయం దక్కించుకోలేక పార్టీని అధికారంలోకి తీసుకురాలేక ఓ అసమర్థుడు చేస్తున్న ఆక్రోశం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని రాహుల్ తప్పుబట్టడాన్ని వారు ఖండించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థను ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రాహుల్ కు వ్యతిరేకంగా 272 మంది సంతకాలు చేశారు.

ఇలా రాహుల్ కు వ్యతిరేకంగా దండెత్తిన వారిలో 16 మంది సుప్రీంకోర్టు హైకోర్టులకు చెందిన మాజీ న్యాయమూర్తులు, 123 మంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, 133 మంది మాజీ సైనిక ఉన్నతాధికారులు, మరో 14 మంది మాజీ దౌత్యవేత్తలు ఉండడం గమనార్హం.

Related Post

చంద్ర‌బాబుకు మోడీ ఫోన్‌: కీల‌క స‌మ‌యంలో స్పెష‌ల్ అటెన్ష‌న్‌చంద్ర‌బాబుకు మోడీ ఫోన్‌: కీల‌క స‌మ‌యంలో స్పెష‌ల్ అటెన్ష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా సోమ‌వారం ఉద‌యం ఫోన్ చేశారు. ప్ర‌స్తుతం మొంథా తుఫాను ప్ర‌భావంతో తీర ప్రాంత జిల్లాలు ప్ర‌భావితం అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి సోమ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తుఫాను దోబూచులాడుతూనే ఉండ‌డం