hyderabadupdates.com movies అసెంబ్లీలో బాలయ్యపై జోకులు.. ఫాన్స్ ఊరుకుంటారా?

అసెంబ్లీలో బాలయ్యపై జోకులు.. ఫాన్స్ ఊరుకుంటారా?

సోషల్ మీడియాలో ఊరూ పేరు లేని వాళ్లు ఏది పడితే అది మాట్లాడితే.. ఈ రోజుల్లో సెలబ్రెటీలు, వారి అభిమానులు అంత ఈజీగా వదిలేయట్లేదు. అలాగే జనాలను నవ్వించడం కోసం స్టాండప్ కమెడియన్లు సెలబ్రెటీలను కించపరిచేలా మాట్లాడితే.. వారిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా సోహైల్ అహ్మద్ అనే స్టాండప్ కమెడియన్.. టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ఒక షోలో వెటకారంగా మాట్లాడిన మాటలు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక.. ఆ వ్యక్తి మీద బాలయ్య అభిమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకీ సోహైల్ అహ్మద్.. బాలయ్య గురించి ఏమన్నాడంటే?

ఒక షోలో భాగంగా సోహైల్ కామెడీ చేస్తూ..‘‘బాలయ్య ఒరిజినల్ రెబల్ స్టార్. మాగ్జిమం మీరు రెబల్ అయితే ఏం చేస్తారు? ఆఫీసుకు తాగి పోతారు. కానీ బాలయ్య అసెంబ్లీకి పొయినాడు తాగి. ఎవుడాడు అడ్డం పడేది? టీఎఫ్ఐలో ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి.

ఫ్యాన్ వార్స్‌లో బాలయ్య అభిమానులు ఎవ్వరూ కనబడరు. ఎందుకంటే మీరు డిఫెండ్ చేసుకోవాల మీ హీరోను తిడితే. వేరే హీరోలను తిట్టే పనిలేదు. ఎందుకంటే బాలయ్యే తిడతాడు. ఎవుడ్రా లండీకొడకా అని. ఆయన ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడన్నమాట. వేరే హీరోల్లాగా బానిసలను తయారు చేయట్లేదు’’ అని సోహైల్ వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యల మీద తీవ్రంగా పరిగణిస్తూ.. ప్రకాశం జిల్లా బాలయ్య అభిమానులు ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలయ్యనే కాక గౌరవ శాసనసభను అగౌరవ పరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్న బాలయ్య ఫ్యాన్స్.. వెంటనే సోహెల్ అహ్మద్ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని.. అంతే కాక సోహైల్ ఇన్‌స్టాగ్రామ్‌ను, తన పేరు మీద ఉన్న ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు.

Related Post