hyderabadupdates.com movies అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?

అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆ పని పూర్తిచేసి .. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.

అసెంబ్లీలో 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అంటూ వైసీపీ సభ్యులనుద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా అని మీడియా ప్రతినిధులను సరదాగా ప్రశ్నించారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని హితవు పలికారు.

వాస్తవానికి ఈ సారి సభకు హాజరైతే వైసీపీకి, జగన్ కు మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. లడ్డూ ఇష్యూతోపాటు అంబటి, జోగి ఇళ్లపై దాడి అంశాన్ని సభలో జగన్ ప్రస్తావించవచ్చు. సభా నియమాల ప్రకారం వైసీపీ సభ్యులకు దక్కే సమయంలో ఈ విషయాలు ప్రస్తావించే అవకాశమున్నా.. అలా చేసేందుకు జగన్ అండ్ కో సిద్ధంగా లేదు.

ఎప్పటిలాగే వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్ ఈ రోజుకే పరిమితం కాదని..ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం బాయ్ కాట్ చేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే, కనీసం బడ్జెట్ సమావేశాలకైనా జగన్, వైసీపీ సభ్యులు వస్తే జనం దృష్టిలో వారికి ఉన్న కొద్దో గొప్పో ఇమేజ్ మిగులుతుంది.

ఇలాంటి సమయంలోనూ అసెంబ్లీకి రాకపోతే ఇంక ఎప్పుడూ వస్తారని సొంత నేతలే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. ఇలానే కొనసాగితే నష్టం ప్రభుత్వానిది కాదని, తమదే అంటూ మొత్తుకుంటున్నారు. ఇక, యథా ప్రకారం తమకు బలమున్న శానస మండలిలోనే వైసీపీ తమ వాయిస్ వినిపించనుందని తెలుస్తోంది.

కాగా, మార్చి 7 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు దినాలు, పండుగలు మినహాయించి మొత్తం 17 రోజుల పాటు సభ జరగనుంది. అవసరమైతే సమావేశాలు మరికొద్ది రోజులు పొడిగించనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 18న బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు.

Related Post

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం

బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!

తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే కీలకమైన కొత్తగూడెం కార్పరేషన్ లో హంగ్ ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ కూడా 22 డివిజన్లలో విజయం