hyderabadupdates.com movies అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ త‌న ప‌ట్టును వ‌రుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోంద‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి. ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ నేతృత్వంలో.. ముందుకు సాగిన క‌మ‌ల ద‌ళానికి అసోం ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని పేర్కొన్నాయి. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డ బీజేపీ పాల‌నే సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీని గ‌ద్దె దింపేందుకు కాంగ్రెస్ అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. వ‌రుస ప్ర‌చారాల‌తో రాహుల్ గాంధీ దుమ్మురేపారు. అయిన‌ప్ప‌టికీ.. అసోంలో బీజేపీదే పైచేయి అని తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెల్ల‌డించాయి.

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి ఈ నెల 23న ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రిగింది. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగియ‌డంతో.. ప‌లు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను వెల్ల‌డిం చాయి. ఒక‌టి రెండు సంస్థ‌లు మాత్ర‌మే కాంగ్రెస్‌కు కొంత మేర‌కు ఎడ్జ్ ఉంద‌ని చెప్ప‌గా.. మెజారిటీ సంస్థ‌ల‌న్నీ.. బీజేపీకే ప‌ట్టం క‌ట్టాయి. ప్ర‌జ‌ల నాడిని అర్ధం చేసుకున్న నాయ‌కుడిగా ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ ముందున్నార‌ని స‌ర్వేలు పేర్కొన్నా యి. అంతేకాదు.. క‌నుచూపు మేర‌లో కూడా కాంగ్రెస్ పుంజుకుంటున్న ప‌రిస్థితి లేద‌ని స‌ర్వేలు పేర్కొన్నాయి.

ఇదీ ఎగ్జిట్ పోల్ అంచ‌నా..

చాణక్య స్ట్రాటజీస్‌: బీజేపీ: 88-98, కాంగ్రెస్‌: 22-32

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ: 68-72, కాంగ్రెస్‌: 22-26

పల్స్‌ టుడే: బీజేపీ: 88-92, కాంగ్రెస్‌: 28-32

ఎస్ ఏ ఎస్‌ గ్రూప్‌: బీజేపీ: 84-90, కాంగ్రెస్‌: 40-46

బెంచ్ మార్క్‌ సర్వే: బీజేపీ: 72-85, కాంగ్రెస్‌: 37-48

యాక్సిస్‌ మై ఇండియా: బీజేపీ: 88-100, కాంగ్రెస్‌: 24-36

పోల్‌ ల్యాబ్‌: బీజేపీ 89-90, కాంగ్రెస్‌: 31-32

Related Post

భార్య ఫోన్‌లో `బ్లూడ్ర‌మ్‌` స్టోరీ.. ప్రియుడు ఏం చేశాడు?భార్య ఫోన్‌లో `బ్లూడ్ర‌మ్‌` స్టోరీ.. ప్రియుడు ఏం చేశాడు?

వివాహేత‌ర సంబంధాలు ఎంత‌కైనా తెగించేలా చేస్తున్న రోజులు ఇవి!. భ‌ర్త‌ల‌పై భార్య‌లు, భార్య‌ల‌పై భ‌ర్త‌లు క‌సి తీర్చుకుంటున్నారు.(అంద‌రూ కాదు.. 100కు 3 శాతం మంది అనిఇటీవ‌ల స‌ర్వేలు చెప్పాయి) ఈ క్ర‌మంలో భ‌ర్త‌ల‌ను హ‌త్య చేయిస్తున్న భార్య‌ల సంగ‌తులు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలోప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్, జన నాయకుడు పరస్పరం తలపడేందుకు సిద్ధపడటంతో బాక్సాఫీస్ క్లాష్ లో ఎవరు విజేత అవుతారనే దాని మీద రకరకాల అంచనాల్లో