hyderabadupdates.com Gallery ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి

ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి

ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి post thumbnail image

చెన్నై : త‌మిళ‌నాడులో క్రికెట్ ఫీవ‌ర్ అలుముకుంది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజ‌ధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండ‌గా సూప‌ర్ -8లో భాగంగా భార‌త జ‌ట్టు జింబాబ్వేతో ఆడ‌నుంది. ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్ ల‌లో గెలిచిన భార‌త్ మ‌రో కీల‌క‌మైన మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా చేతిలో 67 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో ర‌న్ రేట్ ప‌రంగా కిందికి ప‌డి పోయింది. ఇక అనూహ్యంగా స‌ఫారీలు దుమ్ము రేపుతున్నారు. అభిషేక్ శ‌ర్మ‌తో పాటు మ‌రికొంద‌రు ప్లేయ‌ర్లు ఆశించిన మేర ఆడ‌లేక పోతున్నారంటూ మండిప‌డుతున్నారు ఫ్యాన్స్.
మ‌రో వైపు తాజా స‌మాచారం ప్ర‌కారం జట్టు ఓవ‌రాల్ ప్రదర్శన పట్ల కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకపక్ష ఓటమి తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , కొంతమంది సీనియర్ ఆటగాళ్లను మందలించినట్లు వార్తలు వస్తున్నాయి. అతిపెద్ద సమస్య ఓటమి మాత్రమే కాదు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాధ్యత, ఉద్దేశ్యం లేకపోవడం. స్పష్టమైన విధానం లేదు, ఒత్తిడిలో ప్రశాంతత లేకుండా ఉండ‌డం, జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యత వహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు . ప్రస్తుతం, జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది . 2026 T20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించే ప్రమాదం ఉన్నందున, శిబిరంలో ఆందోళనలు పెరుగుతున్నాయి.మ‌రో వైపు తుది జట్టులో స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఉంటాడా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది. ఇంకో వైపు అభిషేక్ శ‌ర్మ‌ను త‌ప్పించి త‌నను తీసుకుంటారా లేక అలాంటి పాత జ‌ట్టునే కంటిన్యూ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
The post ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎంసిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో అందినంత మేర క‌ల్వ‌కుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర

అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువుఅద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు

హైద‌రాబాద్ : చారిత్ర‌క బ‌మృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ద‌మైంది. ఆదివారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. న‌గ‌ర ప్రజ‌ల‌కు ఇక నుంచి రానుంద‌ని ప్ర‌క‌టించారు. చెరువు సుంద‌రంగా త‌యార‌వ్వ‌డం ప‌ట్ల హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆనందం

మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలిమత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి

అమ‌రావ‌తి : మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ , కమిటీ సభ్యులు