hyderabadupdates.com Gallery ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది

ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది

ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది post thumbnail image

బెంగ‌ళూరు : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ -2026 సీజ‌న్ అట్ట‌హాసంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ప్రారంభ‌మైంది. ముందుగా బ్యాటిగ్ చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. త‌న‌తో పాటు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ సైతం సూప‌ర్ షో చేశాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఎస్ ఆర్ హెచ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. టోర్నీలో తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియ‌న్ స‌త్తా చాట‌డం విశేషం. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ ప‌టేదార్ అంచ‌నాలు ఫ‌లించాయి. త‌ను ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
క్రీజులోకి వ‌చ్చిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో, ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ అద్భుతంగా ఆడాడు. త‌ను 38 బంతులు ఎదుర్కొని 80 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. త‌న‌తో పాటు క్లాసెన్ 31, అనికేత్ 43 ప‌రుగుల‌తో రాణించారు. దీంతో భారీ ల‌క్ష్యాన్ని ప్ర‌త్య‌ర్థి ఆర్సీబీ ముందు ఉంచ‌గ‌లిగింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. జాక‌బ్ డ‌ఫీ 22 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే రొమారియో 54 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. అనంత‌రం మైదానంలోకి ఎంట‌ర్ అయ్యిన కోహ్లీ త‌న స‌హ‌జ సిద్ద‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. 38 బంతులు ఆడి 69 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ 26 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 4 సిక్సుల‌తో 61 ప‌రుగులు చేశాడు. సూప‌ర్ బౌలింగ్ చేసిన డ‌ఫీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పుర‌స్కారం ద‌క్కింది.
The post ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సహకార రంగానికి డిజిటల్ బలం : అచ్చెన్నాయుడుసహకార రంగానికి డిజిటల్ బలం : అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని 2,021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (PACS) 2,017 సంఘాలను రూ.62.34 కోట్ల వ్యయంతో e-PACSలుగా మార్పు చేసి పూర్తిస్థాయి డిజిటల్ లావాదేవీలను అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మార్పుతో పారదర్శకత, వేగవంతమైన సేవలు

KTR: జూబ్లీహిల్స్‌ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే – కేటీఆర్KTR: జూబ్లీహిల్స్‌ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే – కేటీఆర్

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఒక కనువిప్పు అవుతుందని చెప్పారు. తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తుందని

ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లుఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా : బాబుతోనే జాబు గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను జగన్ మోసం