hyderabadupdates.com Gallery ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్ post thumbnail image

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సోమ‌వారం సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు వివరించారు సీఎం. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు ఈ సంద‌ర్భంగా బిల్ గేట్స్. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు గేట్స్. . అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు బిల్ గేట్స్. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని,, అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసించారు గేట్స్. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయ‌ని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు.
The post ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి

భార‌తి బిల్డ‌ర్స్ ఆస్తులు ఈడీ అటాచ్భార‌తి బిల్డ‌ర్స్ ఆస్తులు ఈడీ అటాచ్

హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మెస్సర్స్ భారతి బిల్డర్స్ మోసం ద్వారా గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం, మెస్సర్స్ భారతి బిల్డర్స్,

గ్లోబ‌ల్ టెక్నాల‌జీ హ‌బ్ గా అమ‌రావ‌తిగ్లోబ‌ల్ టెక్నాల‌జీ హ‌బ్ గా అమ‌రావ‌తి

తిరుప‌తి : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్లోబ‌ల్ టెక్నాల‌జీ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి మార‌బోతోంద‌ని అన్నారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇకపై క్వాంటం వేగంతో