hyderabadupdates.com movies ఆ నిర్మాతకు ఉన్న తలనొప్పులు సరిపోవని…

ఆ నిర్మాతకు ఉన్న తలనొప్పులు సరిపోవని…

కేవీఎన్ ప్రొడక్షన్స్.. భారతీయ సినీ రంగంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన నిర్మాణ సంస్థ. తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చివరి సినిమాను నిర్మించే అవకాశం కోసం ఎంతోమంది పెద్ద ప్రొడ్యూసర్లు లైన్లో ఉంటే.. వారిని కాదని అవకాశం దక్కించుకున్నాడు ఈ సంస్థ అధినేత కె.నారాయణ. ఆ చిత్రమే.. జననాయగన్.

మరోవైపు ‘కేజీఎఫ్’తో బంపర్ క్రేజ్ సంపాదించుకున్న యశ్ తర్వాతి చిత్రం ‘టాక్సిక్’ను ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ రూపొందించే కొత్త సినిమా కూడా ఆయన చేతికే చిక్కింది. ఒక కొత్త నిర్మాతకు ఇన్ని బంపర్ ఆఫర్లు ఏంటి అనుకున్నారు. కానీ ఈ మూడు ప్రాజెక్టులకూ చిక్కులు తప్పలేదు.

‘జననాయగన్’ సెన్సార్ సమస్యలతో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ‘టాక్సిక్’ సైతం రిలీజ్ డేట్‌ను అందుకోలేక వాయిదా పడింది. చిరు సినిమా కూడా ఆలస్యం అవుతోంది. మరోవైపు నారాయణ నిర్మిస్తున్న ‘కేడీ: ది డెవిల్’ అనే మరో భారీ సినిమాకు కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.

అర్జున్ సర్జా హీరోగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ ఇప్పటికే ఒక పాట కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సంజయ్ దత్, నోరా ఫతేహీల మీద తీసిన పాటలో పచ్చి బూతులు ఉండడంతో దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో లాంచ్ చేశారు. కానీ కొన్ని గంటలకే దాన్ని డెలీట్ చేయాల్సి వచ్చింది.

అందులో సెన్సార్ కాని కొన్ని షాట్స్ ఉండడంతో వివాదం చెలరేగింది. దీంతో ట్రైలర్‌ను తీసేయాల్సి వచ్చింది. నిజానికి ఈ ట్రైలర్ ఏమంత గొప్పగా లేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. దీంతో కొత్త కంటెంట్‌తోె మళ్లీ సెన్సార్ చేయించి ట్రైలర్ వదలబోతున్నారట. అసలు యూట్యూబ్ లో విడుదల చేసే ట్రైలర్ కు సెన్సార్ ఉండదు అనేది తెలిసిన విషయం. కానీ దీని విషయంలో ఎందుకు ఇలా చెబుతున్నారో అంటూ చిక్కడం లేదు.

‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత భర్త, కన్నడ సీనియర్ దర్శకుడు ప్రేమ్ రూపొందించిన ‘కేడీ: ది డెవిల్’కు మొదట్లో మంచి హైప్ ఉండేది కానీ.. వివాదాలు, అంచనాలను అందుకోలేకపోతున్న కంటెంట్ వల్ల సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ కనిపించడ లేదు. ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

Related Post

Mrunal Thakur to Sizzle in Ram Charan’s ‘Peddi’? Here’s What We KnowMrunal Thakur to Sizzle in Ram Charan’s ‘Peddi’? Here’s What We Know

Buzz around Ram Charan’s upcoming film Peddi is getting stronger with every passing day. The latest talk in film circles is about actress Mrunal Thakur possibly featuring in a special