hyderabadupdates.com movies ఆ రాక్ష‌సుడిని ప్ర‌జ‌లే ఓడించారు: చంద్ర‌బాబు

ఆ రాక్ష‌సుడిని ప్ర‌జ‌లే ఓడించారు: చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడించిన ఆ రాక్ష‌సుడిని(వైసీపీ అధినేత జ‌గ‌న్‌) ప్ర‌జ‌లే గ‌త ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిపించార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. కూట‌మికి దిగ్విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని తెలిపారు. అందుకే.. రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతోంద‌న్నారు. రాష్ట్రంలో వైకుంఠ‌పాళి రాజ‌కీయాల‌కు ప్ర‌జ‌లు చెక్ పెట్టాల‌న్నారు. గుజ‌రాత్‌లో ఒకే ప్ర‌భుత్వం ఉండ‌డంతో అక్క‌డ అభివృద్ధి సాకారం అవుతోంద‌న్నారు. అనేక పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్నారు. అదేవిధంగా ఏపీలోనూ ఒకే ప్ర‌భుత్వం కొన‌సాగితే.. పెట్టుబ‌డులు సాకారం అవుతాయ‌ని.. రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌ని తెలిపారు.

దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లోని పున్న‌మిఘాట్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు స‌తీస‌మేతంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రానికిపెట్టుబ‌డులురావ‌డం శుభ‌సూచ‌క‌మ‌న్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా స‌హ‌కారం ఉంద‌ని, అందుకే ఇటీవ‌ల విశాఖ‌లో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయింద‌ని తెలిపారు. గ‌త 16 మాసాల్లో ప‌ది ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని.. ఇప్పుడు 15 బిలియ‌న్ డాల‌ర్ల‌ను గూగుల్ తీసుకువ‌స్తోంద‌ని తెలిపారు. అమ‌రావ‌తిని వ‌చ్చే మూడేళ్ల‌లో 60 వేల కోట్ల రూపాయ‌ల‌తో అన్ని విధాలా అభివృద్ది చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

“2019-24 మ‌ధ్య ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయ‌న రాష్ట్రాన్ని ప‌ట్టిపీడించాడు. పెట్టుబ‌డి దారుల‌ను త‌రిమి కొట్టాడు. ప్ర‌జ‌ల గొంతు నొక్కాడు. జైళ్ల‌లో పెట్టించాడు. స్వేచ్ఛ లేకుండా చేశాడు. అలాంటి రాక్ష‌సుడిని గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓడించారు. ఇప్పుడు అభివృద్ధి ఫ‌లాలు చేరువ అవుతున్నాయి. వీటిని కొన‌సాగించాలంటే రాష్ట్రంలో వైకుంఠ పాళీ రాజ‌కీయాలు వ‌ద్దు. అలా అయితే.. మ‌ళ్లీ రాష్ట్రం నాశ‌నం అవుతుంది.“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

జీఎస్టీ 2.0 సంస్క‌ర‌ణ‌ల‌తో ప్ర‌తి కుటుంబానికీ నెల‌కు రూ.15 వేల చొప్పున మేలు జ‌రుగుతోంద‌న్నారు. దీనిని అంద‌రూ ఎంజాయ్ చేయాల‌ని సూచించారు. దీపావ‌ళినిపుర‌స్క‌రించుకుని ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి.. దీనిని హ‌రిత దీపావ‌ళిగా నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరారు.

Related Post

Pelli Shuru from Premante: Priyadarshi & Anandhi deliver a lively marriage anthemPelli Shuru from Premante: Priyadarshi & Anandhi deliver a lively marriage anthem

Priyadarshi and Anandhi’s romantic comedy entertainer Premante created good buzz with its first single and teaser getting encouraging response. The movie is scheduled for release on November 21. Directed by

అఖండ-2… వాళ్ళందరితో కీలక సమావేశంఅఖండ-2… వాళ్ళందరితో కీలక సమావేశం

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా రిలీజవుతుందేమో అని అభిమానులు ఆశించారు కానీ.. అలా జరగలేదు. ఈ వీకెండ్ సినిమా రాదని తేలిపోయాక.. కొత్త

దృశ్యం 3 – సినిమాని మించిన ట్విస్టులుదృశ్యం 3 – సినిమాని మించిన ట్విస్టులు

కొన్ని వారాల క్రితమే మోహన్ లాల్ హీరోగా మలయాళం దృశ్యం 3 షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దర్శకుడు జీతూ జోసెఫ్ వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నారు. నిజానికి అన్ని భాషల్లో సమాంతరంగా షూట్ చేసి ఒకేసారి