hyderabadupdates.com movies ఆ ‘రింగ్‌’పై రష్మిక మాట్లాడిందండోయ్..

ఆ ‘రింగ్‌’పై రష్మిక మాట్లాడిందండోయ్..

కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా తెలుగింటి కోడలు కాబోతోందన్న విషయం బహిరంగ రహస్యమే. కొన్ని వారాల కిందటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఐతే కారణమేంటో గానీ.. ఆ విషయాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటు విజయ్, అటు రష్మిక ఇద్దరూ తమ వేళ్లకు ఉంగరాలు ధరించి ఉండడంతో అభిమానులకు విషయం అర్థమైపోయింది.

కానీ నిశ్చితార్థం గురించి ఎప్పుడు అధికారికంగా చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇద్దరూ మౌనం వహిస్తున్నారు. ఐతే తన కొత్త చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్లలో భాగంగా జగపతి బాబు నిర్వహించే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోకు అతిథిగా వచ్చిన రష్మిక తన వేలికి ఉన్న ఉంగరం గురించి మాట్లాడింది. కానీ నిశ్చితార్థం గురించి మాత్రం ఓపెన్ కాలేదు.

ఈ షోలో భాగంగా జగపతిబాబు రష్మికను ఆసక్తికర ప్రశ్నలు వేశారు. విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, దళపతి విజయ్.. ఇలా విజయ్‌లందరితోనూ సినిమాలు చేస్తున్నావు, విజయాలు సొంతం చేసుకుంటున్నావు.. విజయ్ అనే పేరుతో నీకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉన్నట్లుందే అంటే రష్మిక సిగ్గుపడింది.

ఇక వేలికి ఉన్న రెండు ఉంగరాల గురించి ప్రస్తావించగా.. అవి రెండూ చాలా ఇంపార్టెంట్ అని ఆమె బదులిచ్చింది. ఆ రెండు ఉంగరాల్లో ఒకటి చాలా స్పెషల్ అట కదా.. దానికో పెద్ద హిస్టరీ ఉందట కదా అంటే రష్మిక సిగ్గుపడిపోయింది. ఆ సమయంలో ఆడియన్స్ గట్టిగా అరవగా.. వాళ్ల గోలేంటో చూడమని అన్నారు జగపతి. మరి దానికి రష్మిక ఏమందో షో మొత్తం చూడాల్సిందే.

Related Post