hyderabadupdates.com movies ఇంటర్నెట్ సెన్సేషన్.. గంటకెంత అని అడుగుతున్నారు

ఇంటర్నెట్ సెన్సేషన్.. గంటకెంత అని అడుగుతున్నారు

గిరిజ ఓక్.. ఇటీవల సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. 37 ఏళ్ల ఈ మరాఠీ నటి గురించి కొన్ని వారాల ముందు వరకు జనానికి పెద్దగా తెలియదు. ఆమిర్ ఖాన్ మూవీ ‘తారే జమీన్ పర్’ సహా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు వచ్చిన పాపులారిటీ అంతంతమాత్రమే. కానీ నటిగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు చేసినా రాని గుర్తింపు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది. 

ఆ ఇంటర్వ్యూలో తన లుక్, తన హావభావాలు.. ఆమె చెప్పిన మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ మాత్రమే కాదు.. గతంలో ఆమె నటించిన అనేక సినిమాల వీడియోలు కూడా కూడా వైరల్ అయ్యాయి. గిరిజకు కొన్ని రోజుల్లోనే తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఐతే ఈ పాపులారిటీ వల్ల ఆమె కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటోందట. నీ రేటెంత అంటూ నీచమైన మెసేజ్‌లు పెడుతున్నారని ఆమె వాపోయింది.

తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగాక ఎంతోమంది పాజిటివ్ కామెంట్లు పెట్టారని.. దాంతో పాటు కొన్ని దారుణమైన మెసేజ్‌లూ వస్తున్నాయని గిరిజ ఓక్ చెప్పింది. ‘‘నీతో గంట సేపు గడపాలంటే ఎంత తీసుకుంటావు’.. ‘‘నీ రేటు ఎంత’’ అంటూ చాలామంది తనకు మెసేజ్‌లు పెడుతున్నారని.. ఇలాంటి వాటికి లెక్కే లేదని గిరిజ ఆవేదన వ్యక్తం చేసింది. 

వీళ్లందరికీ నిజ జీవితంలో తాను ఎదురు పడితే తన వైపు కూడా చూడకపోవచ్చని.. ఒక వేళ చూసినా గౌరవంతోనే మాట్లాడతారు తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరని ఆమె అభిప్రాయపడింది. కానీ ఆన్ లైన్లో మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారని గిరిజ వాపోయింది. ఇక తన ఇంటర్వ్యూ వల్ల మంచి పాపులారిటీ వచ్చినా.. అదేమీ అవకాశాలు తెచ్చిపెట్టడం లేదని గిరిజ చెప్పింది. కొత్తగా తనకు సినిమా ఆఫర్లేమీ రాలేదని.. తన జీవితంలో పెద్ద మార్పేమీ లేదని ఆమె తేల్చేసింది.

Related Post

‘మాస్’ మెచ్చుకుంటే చాలు ‘రాజా’‘మాస్’ మెచ్చుకుంటే చాలు ‘రాజా’

ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న మాస్ జాతర ప్రీమియర్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాహుబలి ఎపిక్ గొడవలో పడి జనాలు దీని మీద అంత సీరియస్ గా దృష్టి పెట్టకపోవడంతో, బజ్ పరంగా సోషల్ మీడియాలో పెద్దగా హడావిడి లేకపోవడం

ఎన్టీఆర్.. ఇక బ్రేక్ లేకుండాఎన్టీఆర్.. ఇక బ్రేక్ లేకుండా

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమాగా ‘డ్రాగన్’ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘దేవర’తో మంచి ఫలితాన్నే అందుకున్న యంగ్ టైగర్.. ‘వార్-2’తో షాక్ తిన్న నేపథ్యంలో ‘డ్రాగన్’ పెద్ద హిట్ అవడం చాలా

కాంతార వర్సెస్ ఛావా.. గెలిచేదెవరు?కాంతార వర్సెస్ ఛావా.. గెలిచేదెవరు?

ఈ నెల ఆరంభంలో ద‌స‌రా కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది కాంతార: చాప్ట‌ర్-1. అయితే మేకింగ్ ద‌శ‌లో ఉన్న హైప్ రిలీజ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి త‌గ్గ‌డం.. తొలి రోజు కొంత మిక్స్డ్ టాక్ రావ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర