హైదరాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. పలు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నయనతార కలిసి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డార్లింగ్ ప్రభాస్ , మాళవిక మోహన్, నిధి అగర్వాల్ , రిద్ది కుమారి కలిసి నటించిన ది రాజా సాబ్ ఆశించిన మేర ఆడలేదు. మరో వైపు మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలిసి నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా విడుదలైంది. అయితే ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో సాగుతోంది . ప్రస్తుతానికి సినిమాల పరంగా చూస్తే వసూళ్ల పరంగా చూస్తే మెగాస్టార్ మూవీ ఏకంగా రెండు రోజుల్లోనే రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
రెండో ప్లేస్ లో అనగనగా ఒక రోజు మూవీ సూపర్ సక్సెస్ తో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మొదటి ఇరవై నిమిషాలు రొటీన్‌గా ఉంటాయి. తర్వాత, కొన్ని పంచ్ డైలాగ్‌లు , వ్యంగ్య సన్నివేశాలు బాగా పండాయి. ‘భీమవరం బల్మాస , రాజు గారి పెళ్లిరో రెండు పాటలు తెరపై బాగా వచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇప్పటి వరకు చూడటానికి మంచి సినిమా అని చెప్పవచ్చు.
ఇందులో గౌరవపురం జమీందార్ వారసుడు రాజు గ (నవీన్ పోలిశెట్టి) తప్పుడు ప్రతిష్టకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేయబడ్డాడు. నవీన్ పోలిశెట్టి విజయవంతమైన చిత్రాలను అందించడం ద్వారా చాలా స్థిరంగా ఉన్నాడు.
The post ఇంటిల్లిపాదికి ‘అనగనగా ఒక రోజు’ పండగే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఇంటిల్లిపాదికి ‘అనగనగా ఒక రోజు’ పండగే
Categories: