hyderabadupdates.com Gallery ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం

ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం

ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం post thumbnail image

హైద‌రాబాద్ : ఇండియాలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మీడియా సంస్థ‌గా గుర్తింపు పొందింది ఇండియా టుడే. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ను కోరారు లేఖ‌లో. ఈ మేరకు ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ , ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లి పూరీ ఆయనకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడం లోనూ, రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో సందర్భోచితంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ గమనాన్ని అంచనా వేస్తూ, కీలక అంశాలపై చర్చించే వేదికగా ఈ కాన్‌క్లేవ్ గుర్తింపు పొందింది. భిన్నమైన ఆలోచనలు, స్వేచ్ఛాయుతమైన చర్చలు, సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తోంది.ఈ వేదికపై ప్రసంగించిన ప్రపంచస్థాయి దిగ్గజాల సరసన కేటీఆర్ చేరనున్నారు. ఇప్పటి వరకు ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి దేశాధినేతలతో పాటు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గీతా గోపీనాథ్ వంటి పారిశ్రామిక, ఆర్థిక రంగ నిపుణులు ప్రసంగించారు. భారతదేశపు మారుతున్న రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంపై కేటీఆర్ తన విశ్లేషణను పంచుకోవాలని ఇండియా టుడే గ్రూప్ కోరింది.
The post ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవోటీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవ‌లే ల‌డ్డూ క‌ల్లీ

PM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీPM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

    బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్‌ మాజీ సీఎం, దివంగత

IRCTC Scam: బీహార్‌ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌IRCTC Scam: బీహార్‌ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్‌ షాక్‌

IRCTC Scam : బీహార్‌ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణీ రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై అభియోగాలు