hyderabadupdates.com movies ఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరిక

ఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరిక

మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాల నిర్వహణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. అలా కాకుండా వ్యక్తుల సమాచారాన్ని లీక్ చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. మీకు నచ్చకపోతే ఈ దేశం నుంచి వెళ్లిపోవచ్చు అని తేల్చిచెప్పింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో తీసుకువచ్చిన గోప్యతా చట్టాన్ని ఏ సంస్థ అయినా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా చెందిన సమాచారాన్ని దోచుకునేందుకు తాము అంగీకరించబోమన్నారు. ఒకవేళ దేశంలోని చట్టాలను గౌరవించలేకపోతే లేదా వాటి ప్రకారం నడుచుకోలేకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు.

విషయం ఏంటి?

ఈరోజుల్లో తెల్లారినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది వాట్సాప్‌లోనే గడుపుతున్నారు. ఆనందం, బాధ, ఆఫీసు పని ఏదైనా కూడా వాట్సాప్ కీలక వేదికగా మారింది. ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నా వాట్సాప్‌తో ప్రజలకు గట్టి అనుబంధం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారాన్ని అలుసుగా తీసుకున్న వాట్సాప్ వ్యక్తుల సమాచారాన్ని మెటాకు చేరవేస్తోందన్నది కొన్నేళ్లుగా ప్రధాన చర్చ. విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2011లో దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.

ఈ పిటిషన్‌పై తరచుగా విచారణలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రైవసీ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందేనని, వాట్సాప్ సంస్థ తన వినియోగదారుల సమాచారాన్ని ఇతర ఏ సంస్థతోనూ పంచుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి అకౌంట్ అయినా వాట్సాప్ తన ఇష్టానుసారం వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దేశం నుంచి వెళ్లిపోవచ్చని కూడా వ్యాఖ్యానించింది.

Related Post

కేసీఆర్ పేరు లేకుండానే కవిత తెలంగాణ పోస్టుకేసీఆర్ పేరు లేకుండానే కవిత తెలంగాణ పోస్టు

తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొద్ది రోజులుగా దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే,

మ‌మ్ముట్టి… ఇక్క‌డ యాత్ర‌… అక్క‌డ పాద‌యాత్ర‌మ‌మ్ముట్టి… ఇక్క‌డ యాత్ర‌… అక్క‌డ పాద‌యాత్ర‌

మ‌ల‌యాళ లెజెండ‌రీ న‌టుడు మ‌మ్ముట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగానే ప‌రిచ‌యం. 90వ ద‌శ‌కంలోనే ఆయ‌న స్వాతికిర‌ణం లాంటి క‌ల్ట్ మూవీలో న‌టించి తెలుగు ఆడియ‌న్సుని మైమ‌రిపించారు. త‌మిళ అనువాదం ద‌ళ‌ప‌తితోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ముద్ర వేశారు. ఇక కొత్త

మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజంమాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030 నాటికి ఆసియాలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తుంది. సూర్యలంకతో పాటు సూళ్లూరు