hyderabadupdates.com movies ఇంతకీ… దీపావళి విజేత ఎవరు?

ఇంతకీ… దీపావళి విజేత ఎవరు?

టాలీవుడ్ ఒకప్పుడు దీపావళి సీజన్ మీద పెద్దగా ఫోకస్ చేసేది కాదు. సంక్రాంతి, దసరాల మీద ఉన్నంత దృష్టి ఈ పండుగ మీద ఉండదు. కానీ గత ఏడాది కథ మారింది. దీపావళి టాలీవుడ్‌కు భలేగా కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు అనువాద చిత్రమైన అమరన్ చాలా బాగా ఆడాయి. ఇలా ఒక పండుగ సీజన్లో రిలీజైన మూడు సినిమాలూ సక్సెస్ కావడం అరుదు. అందుకేనేమో ఈసారి పండక్కి ఏకంగా నాలుగు సినిమాలను బరిలోకి దించారు.

అందులో మూడు డైరెక్ట్ మూవీస్ కాగా.. ఒకటి అనువాదం. ఈ నాలుగు చిత్రాల మీదే ఓ మోస్తరు అంచనాలే నిలిచాయి. మరి వీటిలో దీపావళి విజేతగా ఏది నిలుస్తుంది.. గత ఏడాది లాగే 100 పర్సంట్ సక్సెస్ రేట్ ఉంటుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. ఐతే ఈసారి దీపావలి ఆరంభమే తీవ్ర నిరాశకు గురి చేసింది. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ తరహలో నవ్వుల్లో ముంచెత్తుతందనుకున్న ‘మిత్రమండలి’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పెయిడ్ ప్రిమియర్స్ నుంచి బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే సినిమాకు వసూళ్లు లేవు. ప్రేక్షకులు ఔట్ రైట్‌గా ఈ చిత్రాన్ని తిరస్కరించారు.

ఇక శుక్రవారం రిలీజైన డ్యూడ్, తెలుసు కదా చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. డ్యూడ్ యూత్‌ను ఆకట్టుకున్నప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఐతే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘తెలుసు కదా’ క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది కానీ.. ఎక్కువమంది బోర్ అనే అంటున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించేలా ఉన్నారు. రివ్యూస్ మోడరేట్‌గా వచ్చాయి.

ఇక రేసులో చివరగా వచ్చిన ‘కే ర్యాంప్’‌కు క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఇందులో మాస్ కామెడీ యూత్‌, మాస్‌కు ఎక్కుతున్నట్లే కనిపిస్తోంది. ‘కే ర్యాంప్’కు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలో స్పందన బాగుంది. ఈ దీపావళికి క్లియర్ విన్నర్ అంటూ ఏ సినిమా లేదు. ఓపెనింగ్స్ పరంగా డ్యూడ్, కే ర్యాంప్ బెటర్‌‌గా పెర్ఫామ్ చేసేలా ఉన్నాయి. పూర్తి స్థాయి విన్నర్ ఎవరనేది ఒక వారం గడిస్తే కానీ చెప్పలేం.

Related Post

Ram is the King of Hearts – Bhagyashri Borse’s speech becomes a hot topicRam is the King of Hearts – Bhagyashri Borse’s speech becomes a hot topic

Talented actress Bhagyashri Borse’s speech at Andhra King Taluka’s musical concert at RK Beach in Vizag on Saturday night continues to be a hot topic. The way Bhagyashri showered praises,